న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'జీవిత కాలంలో ధోని లాంటి క్రికెటర్ ఒక్కసారే వస్తాడు'

టీమిండియా రెండు వరల్డ్ కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్. తన ఆటతోనే కాదు నడవడికతో కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. 

By Nageshwara Rao

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... పరిచయం అక్కర్లేని పేరు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా ధోని ప్రదర్శన సాటిలేనిది. టీమిండియా రెండు వరల్డ్ కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్. తన ఆటతోనే కాదు నడవడికతో కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

అలాంటి ధోని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. గతేడాది రైజింగ్ పూణె సూపర్ జెయింట్ కెప్టెన్‌గా కూడా తప్పించబడినప్పటికీ, ధోనికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పలువురు మాజీలు, క్రికెట్ విశ్లేషకులు ఇప్పటికీ ధోనిపై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు.

‘A cricketer like MS Dhoni comes once in a life-time, never write him off’

తాజాగా ధోనిపై టీమిండియా మాజీ సెలక్టర్ విక్రమ్ రాథోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'జీవిత కాలంలో ధోనీ లాంటి వ్యక్తి ఒక్కసారే వస్తాడు. కెప్టెన్సీగా పెను మార్పులకు శ్రీకారం చుట్టాడు. తన బ్యాటింగ్‌తో టీమిండియా మిడిల్ ఆర్డర్‌‌ను పటిష్టం చేశాడు. అలాంటి ధోనిని టీమిండియా నుంచి తొలగించడం అంత తేలిక కాదు' అని చెప్పాడు.

ఇప్పటికీ ప్రపంచంలో అత్యుత్తమ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోనియేనని చెప్పుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి గ్లోబర్ టోర్నమెంట్‌లో ధోనీ లాంటి ఆటగాడు ఉండటం చాలా అవసరం అని విక్రమ్ రాథోర్ చెప్పారు.

'పేస్ బౌలింగ్‌లో వికెట్ల మధ్యలో ధోని పరుగులు రాబట్టడంలో మంచి దిట్ట. ఇంగ్లాండ్ పిచ్‌లు భారత్‌కు ఎంతో అనుకూలం' అని తెలిపాడు. ఇక విక్రమ్ రాథోర్ భారత్ తరుపున 1996-97 మధ్య కాలంలో ఆరు టెస్టులు, ఏడు వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X