న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బంగ్లాపై 6 వికెట్లు తీయడం ఓ కల.. నా హృదయానికి దగ్గరైన ప్రదర్శన అది'

6/7 was my dream spell – Deepak Chahar after bagging ICC’s T20I Performance of the Year

ముంబై: బంగ్లాదేశ్‌పై సాధించిన ఆ స్పెల్ (6/7) నాకెంతో ప్రత్యేకం. ఏడు పరుగలిచ్చి 6 వికెట్లు తీయడం ఒక కల లాంటి ప్రదర్శన. అదెప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది అని టీమిండియా యువ పేసర్ దీపక్‌ చాహర్‌ పేర్కొన్నాడు. 2019కి గాను ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) బుధవారం పురస్కారాలను ప్రకటించింది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి 'స్పిరిట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డు, రోహిత్‌ శర్మకి 'వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డులు దక్కాయి.

'కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు.. ఏ బౌలర్‌కైనా కోహ్లీ వికెట్‌ లభిస్తే గొప్ప బహుమతి''కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు.. ఏ బౌలర్‌కైనా కోహ్లీ వికెట్‌ లభిస్తే గొప్ప బహుమతి'

6 వికెట్లు తీయడం ఓ కల:

6 వికెట్లు తీయడం ఓ కల:

దీపక్‌ చాహర్‌ టీ20 బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇయర్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. గతేడాది నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో దీపక్‌ 6/7తో టీ20ల్లో బెస్ట్‌ ఫిగర్స్‌ నమోదు చేశాడు. ఐసీసీ పురస్కారాలపై చాహర్‌ స్పందించాడు. 'ఈ అవార్డు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ఐసీసీ, బీసీసీఐకి ధన్యవాదాలు. ఆ ప్రదర్శన నాకెంతో ప్రత్యేకం.చాలాకాలం తర్వాత భారత్‌ తరఫున ఆడే అవకాశం వచ్చింది. ఏడు పరుగలిచ్చి 6 వికెట్లు తీయడం ఒక కల లాంటి ప్రదర్శన. ఇదెప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది' అని చాహర్‌ అన్నాడు.

రోహిత్‌ ఆనందం:

రోహిత్‌ ఆనందం:

రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు అందించిన ఐసీసీకి కృతజ్ఞతలు. దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశమిచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు. మా ప్రతిభ, అభిరుచిని గుర్తించినందుకు ఆనందంగా ఉంది. 2019లో మా ప్రదర్శన సంతోషంగా అనిపించింది. అయితే మరింత మెరుగ్గా ఆడాల్సింది. మొత్తానికి మేం సానుకూలంగా 2020లోకి వెళ్లాం' అని అన్నాడు. గతేడాది వన్డేల్లో రోహిత్ ఆరు సెంచరీలు చేసాడు. ఐదు సెంచరీలు ప్రపంచకప్‌లోనే బాదాడు.

 కోహ్లీ ఆశ్చర్యం:

కోహ్లీ ఆశ్చర్యం:

'చాలా ఏళ్లు తప్పులెన్నో చేసి అందరి దృష్టిలో పడ్డా. ఇప్పుడు ఈ పురస్కారం రావడం ఆశ్చర్యంగా ఉంది. ఇతరులపై క్రీడాకారులకు సోదరభావం ఉండాలి. వ్యక్తిగత పరిస్థితుల వల్లే ఆ ఘటన జరిగింది. దాని నుంచి బయటపడి వచ్చిన వ్యక్తిపై స్లెడ్జింగ్‌ చేసి ప్రయోజనం పొందాలని ప్రత్యర్థులు భావిస్తారు. అది ఫర్వాలేదు. కానీ.. అవహేళన చేయడం మాత్రం క్రీడాస్ఫూర్తిలో భాగం కాదు. దాన్ని నేను అంగీకరించను. మా అభిమానులు అలాచేయకూడదు. ఆ బాధ్యతనంతా మేమే తీసుకోవాలి. ప్రత్యర్థిపై పైచేయి సాధించాలనుకోవడం సరైందే. ఎవరో ఒకర్ని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకొని భావోద్వేగానికి గురిచేయడం మాత్రం తప్పు' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

స్టోక్స్‌కు గార్‌ఫీల్డ్‌ సోబెర్స్‌:

స్టోక్స్‌కు గార్‌ఫీల్డ్‌ సోబెర్స్‌:

2019 ఐసీసీ వరల్డ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు (గార్‌ఫీల్డ్‌ సోబెర్స్‌ ట్రోఫీ) ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు, స్కాట్లాండ్‌ కెప్టెన్‌ మీర్‌ గూసే 2019 అసోసియేట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు, ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ సంచలనం మార్కస్‌ లబుషేన్‌ ఎమెర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు ఎంపికయ్యారు. అంపైర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ ఎంపికయ్యాడు.

Story first published: Thursday, January 16, 2020, 14:35 [IST]
Other articles published on Jan 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X