న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

5వ టెస్టు, ఆఖరి రోజు: రెండో ఇన్నింగ్స్‌లో తెలుగు కుర్రాడు విహారి డకౌట్

India VS England 5th Test: Hanuma Vihari Ducked Out By Ben Stokes
5th Test, Day 5 at The Oval: Rahane & Vihari Depart in Quick Succession, England Need Five Wickets to Win

హైదరాబాద్: ఓవల్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయిన రహానే రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.

సచిన్ 100వ సెంచరీ చేసిన వేళ బంగ్లా చేతిలో భారత్ ఓటమిసచిన్ 100వ సెంచరీ చేసిన వేళ బంగ్లా చేతిలో భారత్ ఓటమి

37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహానేను మొయిన్‌ అలీ బోల్తా కొట్టించాడు. 36వ ఓవర్‌లో అలీ వేసిన మూడో బంతిని ఎదుర్కొన్న రహానే... కీటన్ జెన్నింగ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో కేఎల్ రాహుల్, రహానే భాగస్వామ్యానికి తెరపడింది. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

రహానే ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన తెలుగు కుర్రాడు హనుమ విహారి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌‌తో అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేసిన హనుమ విహారి తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక, రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతాడని అంతా భావించారు.

అత్యధిక వన్డేలకు నాయకత్వం: చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్‌అత్యధిక వన్డేలకు నాయకత్వం: చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్‌

1
42378

అయితే, రెండో ఇన్నింగ్స్‌ 37వ ఓవర్లో బెన్ స్టోక్స్‌ వేసిన నాలుగో బంతిని ఎదుర్కొన్న హనుమ విహారి వికెట్‌ కీపర్‌ బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 6 బంతులు ఎదుర్కొన్న విహారి ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. విహారి ఔటైన తర్వాత క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు.

ప్రస్తుతం 47 ఓవర్లకు గాను టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్‌ రాహుల్‌ (87), రిషబ్‌ పంత్‌(4) పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 332 పరుగులు చేయగా, టీమిండియా 292 పరుగలకే ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టుకు 40 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 423 పరుగులు చేసింది.

Story first published: Tuesday, September 11, 2018, 17:51 [IST]
Other articles published on Sep 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X