న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో‌ నమోదైన సెంచరీలు 58.. క్రిస్ గేల్ బాదింది ఎన్నో తెలుసా?!!

58 centuries recorded in IPL across all seasons, Chris Gayle bags 6 tons

హైదరాబాద్: 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్‌లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను వెలుగులోకి తీసుకొచ్చింది.. స్టార్ ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ బోర్డుల్లో బీసీసీఐని ప్రత్యేకంగా నిలిపింది. మరోవైపు టీ20 మజాను క్రికెట్ ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఐపీఎల్ చూసి ఎన్నో లీగ్‌లు వెలుగులోకి వచ్చినా.. మెగా టోర్నీకి ఒక్కటి కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఇక ఐపీఎల్ అనగానే బ్యాట్స్‌మన్‌ విధ్వంసమే మొదటగా గుర్తొస్తుంది. బౌలర్లపై విరుచుకుపడుతూ భారీ స్కోర్లు చేస్తుంటారు. టీ20 అంటే మాములుగా సెంచరీలు నమోదవ్వడం కొంచెం కష్టమే. కానీ బ్యాట్స్‌మన్‌ విధ్వంసం కారణంగా సెంచరీలు కూడా నమోదవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లీగ్‌లలో నమోదైన సెంచరీలను ఓసారి పరిశీలిస్తే...

ఐపీఎల్-58:

ఐపీఎల్-58:

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని టీ20 లీగ్‌లలో కెల్ల ఐపీఎల్‌లో‌ అత్యధిక సెంచరీలు నమోదయ్యాయి. 12 సీజన్లు పూర్తిచేసుకున్న ఐపీఎల్‌లో‌ 58 సెంచరీలు నమోదయ్యాయి. 2016లో అయితే బ్యాట్స్‌మన్‌లు ఏకంగా 7 సెంచరీలు బాదారు. లీగ్‌లో ఇదే అత్యుత్తమం. ఐపీఎల్‌లో సెంచరీల పరంగా అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్. విండీస్ స్టార్ ఓపెనర్ 12 సీజన్లలో ఆరు శతకాలు బాదాడు. 2011లోనే రెండు సెంచరీలు బాదాడు. విరాట్ కోహ్లీ ఐదు శతకాలు చేశాడు. అతడు 2016లోనే నాలుగు బాదాడు.

బీబీఎల్-24:

బీబీఎల్-24:

ఐపీఎల్‌ తర్వాత అత్యధిక సెంచరీలు నమోదయిన టీ10 లీగ్ బిగ్ బాష్ (బీబీఎల్). ఆస్ట్రేలియా గడ్డపై 2011లో ప్రారంభమయిన బిగ్ బాష్ లీగ్‌లో 24 సెంచరీలు నమోదయ్యాయి. బీబీఎల్ లీగ్‌లో అత్యధిక సెంచరీలు నమోదుకాకపోవడానికి అసలు కారణం అక్కడి మైదనాలు పెద్దవిగా ఉండడం. 2015, 2020 సీజన్లలో నాలుగేసి సెంచరీలు నమోదయ్యాయి. డిఆర్సీ షార్ట్, షేన్ వాట్సన్, ల్యూక్ రైట్, క్రెయిగ్ సిమన్స్, ఉస్మాన్ ఖవాజా రెండేసి సెంచరీలు బాదారు.

బీపీఎల్-21:

బీపీఎల్-21:

ఐపీఎల్, బీబీఎల్ తర్వాత బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో అత్యధిక సెంచరీలు నమోదయ్యాయి. బీపీఎల్‌లో బ్యాట్స్‌మన్‌‌ 21 శతకాలు చేశారు. 2019లో బ్యాట్స్‌మన్‌‌లు ఆరు సెంచరీలు బాదారు. ఇదే బీపీఎల్‌లో అత్యుత్తమం. ఇక్కడ కూడా క్రిస్ గేల్ ఐదు శతకాలు బాదాడు. 2017లో 147 పరుగులు చేశాడు. అలెక్స్ హేల్స్, ఏబీ డివిలియర్స్ కూడా శతకాలు చేశారు.

టీ20 బ్లాస్ట్-72:

టీ20 బ్లాస్ట్-72:

ఇంగ్లండ్ కేవలం క్రికెట్‌కు మాత్రమే కాదు టీ20 క్రికెట్‌కు కూడా పుట్టినిల్లే. 2003లోనే అక్కడ పొట్టి ఫార్మాట్ ఆడారు. ఇక 2014లో తమ దేశీయ టీ20 లీగ్‌ను 'టీ20 బ్లాస్ట్'గా పేరు మార్చారు. అప్పుడు గ్లోబల్ లీగ్‌గా మారింది. 2014 నుంచి టీ20 బ్లాస్ట్ లీగ్‌లో 72 సెంచరీలు నమోదయ్యాయి. మైఖేల్ క్లింగర్ ఆరు శతకాలు నమోదు చేశాడు. అయితే టీ20 బ్లాస్ట్ లీగ్‌లో ఆడే మ్యాచ్‌లు ఇతర లీగ్‌లతో పోలిస్తే చాలా ఎక్కువ. అందులోనూ అది ఇంగ్లీష్ కౌంటీల కిందకు వస్తుంది. ప్రైవేట్ లీగ్‌లను లెక్కపోకి తీసుకుంటే.. ఐపీఎల్ అగ్రస్థానంలో ఉంది.

సీపీఎల్-17:

సీపీఎల్-17:

2014లో ప్రారంభమైన కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో బ్యాట్స్‌మన్‌లు 17 శతకాలు బాదారు. 2014 మరియు 2018 సీజన్లలో నాలుగేసి సెంచరీలు నమోదయ్యాయి. సీపీఎల్ లీగ్‌లో క్రిస్ గేల్ మరియు డ్వేన్ స్మిత్ చెరో నాలుగు సెంచరీలు బాది అగ్రస్థానంలో ఉన్నారు. 2019లో బ్రాండన్ కింగ్ అత్యధికంగా 132 పరుగులు చేశాడు.

 పీఎస్‌ఎల్-8:

పీఎస్‌ఎల్-8:

ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో అత్యల్పంగా 8 శతకాలు మాత్రమే నమోదయ్యాయి. 2016లో ప్రారంభమయిన పీఎస్‌ఎల్ లీగ్‌లో మూడు సెంచరీలు 2020లోనే వచ్చాయి. పీఎస్‌ఎల్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌ కమ్రాన్ అక్మల్ మూడు సెంచరీలు బాదాడు. పీఎస్‌ఎల్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 127. 2019లో కోలిన్ ఇంగ్రామ్ చేశాడు.

IPL 2020: Sunrisers Hyderabad జట్టు బలాలు, బలహీనతలు, ప్లే ఆఫ్స్ అంచనా!!

Story first published: Wednesday, September 16, 2020, 14:12 [IST]
Other articles published on Sep 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X