న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జూన్ 15న ఫిట్‌నెస్ పరీక్ష: కోహ్లీ ఫెయిల్ అయితే ఆ ఐదుగురు ఆటగాళ్లు ఎవరు?

By Nageshwara Rao
5 players who could replace Virat Kohli if he misses ODI and T20I series against England

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కౌంటీ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్సీ వహించిన విరాట్ కోహ్లీ లీగ్‌లో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌ నుంచి మెడ నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ బుధవారం మధ్యాహ్నం ముంబైలోని ఖర్‌ ఆస్పత్రికి వెళ్లి వైద్యులను కలిశాడు.

వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రిపోర్టులను పరిశీలించిన వైద్యులు కోహ్లీకి ఆపరేషన్ ఏమీ అవసరంలేదని, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్‌కు అతని ఆరోగ్యం సరిపడదంటూ వైద్యులు ముందుగానే వెల్లడించారు. దీంతో కోహ్లీ కౌంటీ క్రికెట్‌ ఆడకుండా విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది.

కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడని విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ఓ ప్రకటనలో వెల్లడించింది. సర్రే తరఫున కౌంటీలు ఆడాల్సి ఉండగా.. మెడ గాయం కారణంగా కోహ్లీ ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్‌లో భాగంగా మే 17న జరిగిన బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ గాయపడ్డాడని బోర్డు తెలిపింది.

స్కానింగ్, ఇతర వైద్య పరీక్షల అనంతరం మెడికల్ టీం ఈ విషయాన్ని నిర్ధారించిందని బీసీసీఐ వెల్లడించింది. బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ చికిత్స పొందనున్నాడు. జూన్ 15న బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోహ్లీ ఫిట్‌నెస్ టెస్టులో పాల్గొననున్నాడు.

ఈ ఫిట్‌నెస్ టెస్టులో కోహ్లీ పాస్ అవుతాడని బీసీసీఐ మెడికల్ టీం విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఒకవేళ, ఈ ఫిట్‌నెస్‌ టెస్టులో విరాట్ కోహ్లీ గనుక ఫెయిల్ అయితే ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ పర్యటనల్లో జరిగే వన్డే, టీ20 సిరిస్‌లకు కోహ్లీ స్థానాన్ని బీసీసీఐ ఏ ఆటగాడితో భర్తీ చేస్తుందో ఒక్కసారి పరిశీలిద్దామా!

సూర్యకుమార్ యాదవ్

సూర్యకుమార్ యాదవ్

ఐపీఎల్ 11వ సీజన్‌లో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్‌లో ముంబై జట్టు తరుపున టాపార్డర్‌లో రాణించిన సూర్యకుమార్ ఇప్పటవరకు ఆడిన మ్యాచ్‌ల్లో 512 పరుగులు నమోదు చేశాడు. దేశావళీ క్రికెట్‌లో ముంబై తరుపున పరుగుల వరద పారించాడు. 7 మ్యాచ్‌ల్లో 364 పరుగులు చేశాడు. విజయ్ హాజారే ట్రోఫీలో ముంబై తరుపున అత్యధిక పరుగులు నమోదు చేసిన రెండో ఆటగాడు. ఇక, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 54.25 యావరేజితో 217 పరుగులు చేశాడు.

 సంజూ శాంసన్

సంజూ శాంసన్

ఈ సీజన్‌లో సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కేరళకు చెందిన ఈ క్రికెటర్ 15 మ్యాచ్‌ల్లో 31.50 యావరేజితో 441 పరుగులు నమోదు చేశాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక, దేశవాళీ క్రికెట్‌లో కూడా సంజూ శాంసన్‌కు మెరుగైన రికార్డు ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కేరళ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

 శ్రేయాస్ అయ్యర్

శ్రేయాస్ అయ్యర్

ఈ సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. నాలుగు హాఫ్ సెంచరీలతో 37.36 యావరేజితో 411 పరుగులు నమోదు చేశాడు. కెప్టెన్సీ నుంచి గౌతమ్ గంభీర్ వైదొలగడంతో అతడి స్థానాన్ని ఢిల్లీ యాజమాన్యం శ్రేయాస్ అయ్యర్‌తో భర్తీ చేసింది. అయ్యర్ కెప్టెన్సీలో ఢిల్లీ నాలుగు విజయాలను నమోదు చేసినప్పటికీ, ఆ జట్టుని ఫ్లే ఆప్స్‌కు తీసుకెళ్లడంలో విఫలమయ్యాడు. కాగా, ఈ ఏడాది జరిగిన విజయ్ హాజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం అయ్యర్‌కు రాలేదు.

మయాంక్ అగర్వాల్

మయాంక్ అగర్వాల్

ఈ సీజన్‌లో మయాంక్ అగర్వాల్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, జట్టులో పెద్దగా తన ప్రభావాన్ని చూపలేకపోయాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చోటు చేసుకోవడంతో ఈ సీజన్‌లో మయాంక్ అగర్వాల్ ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం 120 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, దేశవాళీ క్రికెట్‌లో మయాంక్ అగర్వాల్ అద్భుత ప్రదర్శన చేశాడు. కర్ణాటకకు చెందిన మయాంక్ అగర్వాల్ వన్డే ఫార్మాట్‌లో 8 మ్యాచ్‌లాడి 723 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 140. ఇక, టీ20 ఫార్మాట్ విషయానికి వస్తే మూడు హాఫ్ సెంచరీలతో 258 పరుగులు నమోదు చేశాడు.

రిషబ్ పంత్

రిషబ్ పంత్

ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. మొత్తం 15 మ్యాచ్‌లాడిన రిషబ్ పంత్ 684 పరుగులు చేశాడు. ఫిరోజ్ షా కోట్లా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేశాడు. ఇక, దేశవాళీ క్రికెట్‌లో సైతం రిషబ్ పంత్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పంత్ 411 పరుగులు చేశాడు. బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ 24 సిక్సులు బాదాడు.

Story first published: Thursday, May 24, 2018, 18:04 [IST]
Other articles published on May 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X