న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

4 wickets for 400 runs: ఆసీస్ గడ్డపై యాసిర్ షా చెత్త రికార్డు!

4 wickets for 400 runs: Yasir Shahs nightmares in Australia continue with pink ball as Warner rules with 335*

హైదరాబాద్: అడిలైడ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన డే నైట్ టెస్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ట్రిపుల్ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలో పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షా తన కెరీర్‌లోనే ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో యాసిర్ షా నమోదు చేసిన బౌలింగ్ గణాంకాలు ఇవి 32-1-197-0.

ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ తొలి ఇన్నింగ్స్‌ను 589/3 పరుగుల వద్ద డిక్లేర్ చేయకపోతే, యాసిర్ షా సులభంగా 200 పరుగులకు పైగా సమర్పించుకునేవాడే. బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో యాసిర్ షా మొత్తం 48.4 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసి 205 పరుగులు సమర్పించుకున్నాడు.

యార్కర్స్, స్లో బంతులను ఎలా సంధిస్తున్నాడో నమ్మశక్యంగా లేదు: బుమ్రాపై మలింగయార్కర్స్, స్లో బంతులను ఎలా సంధిస్తున్నాడో నమ్మశక్యంగా లేదు: బుమ్రాపై మలింగ

షా ఇచ్చిన పరుగులు 402

షా ఇచ్చిన పరుగులు 402

=దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో యాసిర్‌ షా ఇప్పటి వరకు ఇచ్చిన పరుగులు 402. ఒకవేళ ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం వస్తే యాసిర్‌ ఇంకెన్ని పరుగులు సమర్పించుకుంటాడో చూడాలి మరి. తొలి టెస్టులో నాలుగు వికెట్లు తీసినా.... రెండో టెస్టులో వికెట్ తీయక పోవడం అటుంచి భారీగా పరుగులిచ్చాడు.

32 ఓవర్లు వేసి 197 పరుగులు

32 ఓవర్లు వేసి 197 పరుగులు

శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో యాసిర్‌ షా మొత్తం 32 ఓవర్లు వేసి 197 పరుగులు ఇచ్చాడు. అంటే రెండు టెస్టులు కలిపి 80.4 ఓవర్లు వేసిన యాసిర్‌ షా 402 పరుగులు సమర్పించుకున్నాడు. బౌలింగ్‌ యావరేజ్‌ 100.5గా ఉండగా, స్ట్రయిక్‌ రేట్‌ 121గా నమోదైంది. డే నైట్ టెస్టులో యాసిర్ షా పూర్తిగా విఫలమయ్యాడు.

వార్నర్‌ ఒక్కడే 111 పరుగులు

వార్నర్‌ ఒక్కడే 111 పరుగులు

డే నైట్ టెస్టులో యాసిర్‌ షా 197 పరుగులివ్వగా... అందులో డేవిడ్ వార్నర్‌ ఒక్కడే 111 పరుగులు సాధించాడు. ఏది ఏమైనప్పటికీ యాసిర్ షా యొక్క గత టెస్ట్ బౌలింగ్ గణాంకాలను పరిశీలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. 2016-17లో పాకిస్థాన్ ఛివరగా ఆస్ట్రేలియాలో పర‍్యటించినప్పుడు యాసిర్‌ షా మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 207 పరుగులిచ్చాడు.

5 టెస్టులాడిన యాసిర్ షా 12 వికెట్లు తీసి 1074 పరుగులు

5 టెస్టులాడిన యాసిర్ షా 12 వికెట్లు తీసి 1074 పరుగులు

మొత్తంగా ఆస్ట్రేలియా గడ్డపై 5 టెస్టులాడిన యాసిర్ షా 12 వికెట్లు తీసి 1074 పరుగులు ఇచ్చాడు. ఆస్ట్రేలియాలో యాసిర్ షా బౌలింగ్ యావరేజి 89.5గా నమోదైంది. ముఖ్యంగా యాసిర్ షా లెగ్ బ్రేక్స్‌ను అమితంగా ఇష్టపడే బ్యాట్స్‌మన్ ఎవరైనా ఉన్నారంటే అది డేవిడ్ వార్నరే. అడిలైడ్ టెస్టులో కూడా యాసిర్‌కు వార్నర్ చుక్కలు చూపించాడు.

తొలి టెస్టులో అతిగా సంబరాలు

తొలి టెస్టులో అతిగా సంబరాలు

యాసిర్ షా బౌలింగ్‌లో మొత్తం 110 బంతులను ఎదుర్కొన్న వార్నర్ 111 పరుగులు రాబట్టాడు. యాదృచ్ఛికంగా, ప్రస్తుత మిలీనియంలో ఒకే బ్యాట్స్‌మెన్ vs సింగిల్ బౌలర్ సాధించిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసిన తర్వాత యాసిర్ షా చేసుకున్న సంబరాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, November 30, 2019, 18:07 [IST]
Other articles published on Nov 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X