న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌: షోయబ్ అక్తర్ ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డుని బద్దలు కొట్టేదెవరు?

4 bowlers who can break Shoaib Akhtars record for fastest delivery

హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్లు ఎప్పటికీ ప్రత్యేకమే. తమ ఖచ్చితమైన వేగంతో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపిస్తారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బంతిని ఎవరు సంధించారో తెలుసుకుందాం.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన డెలివరీని పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సంధించాడు. 2003 ప్రపంచకప్ ఇందుకు వేదికైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 22న న్యూలాండ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ అక్తర్ 161.3 kph(100.2 mph) వేగంతో బంతిని సంధించాడు.

ఇప్పటివరకు ఈ రికార్డుని ఏ ఫాస్ట్ బౌలర్ కూడా బద్దలు కొట్టలేకపోయాడు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో షోయబ్ అక్తర్ నెలకొల్పిన రికార్డు బద్దలయ్యేలా కనిపిస్తోంది. అయితే, ఈ రికార్డుని బద్దలు కొట్టే ఆ ఫాస్ట్ బౌలర్లు ఎవరో ఒక్కసారి చూద్దాం...

జోఫ్రా ఆర్చర్

జోఫ్రా ఆర్చర్

ఇంగ్లాండ్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు జోఫ్రా ఆర్చర్. ఈ యువ సంచలనం ఇంగ్లాండ్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. టోర్నీలో భాగంగా ఇటీవలే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో యావరేజి స్పీడ్ 146 kphతో బంతిని సంధించాడు. ఈ ప్రపంచకప్‌లో జోఫ్రా ఆర్చర్ వేసిన అత్యంత వేగవంతమైన బంతి 153 kph స్పీడ్‌ని టచ్ చేసింది. అంతేకాదు ఐపీఎల్ 2018లో టాప్-10 స్పీడ్ డెలివరీల్లో ఐదు బంతులు జోఫ్రా అర్చర్‌వే కావడం విశేషం. ఇదే విధంగా వీరంతా బంతులను సంధిస్తే షోయబ్ అక్తర్ రికార్డు బద్దలు కావడం ఖాయం.

కగిసో రబాడ

కగిసో రబాడ

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఏడాదే సంచనాలను నమోదు చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టులో కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. గత జనవరిలో అరంగేట్రం చేసిన కగిసో రబాడ ప్రస్తుతం అటు టెస్టు క్రికెట్‌తో పాటు ఇటు వన్డే క్రికెట్‌లోనూ అగ్రశ్రేణి బౌలర్‌గా కొనసాగుతున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన యువ బౌలర్‌గా గతేడాది అరుదైన ఘనత కూడా సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో 145నుంచి 150 kph స్పీడ్‌తో బంతులు సంధిస్తున్నాడు.

మార్క్ వుడ్

మార్క్ వుడ్

ఇంగ్లాండ్‌కు చెందిన మార్క్ వుడ్ ఈ ప్రపంచకప్‌లో చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన మార్క్ వుడ్ ఆ తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఈ ప్రపంచకప్‌లో 90 mph స్పీడ్‌తో బంతులను సంధిస్తున్నాడు.

లుకీ పెర్గుసన్

లుకీ పెర్గుసన్

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇప్పటివరకు లుకీ ఫెర్గుసన్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. ఫాస్ట్ బౌలర్లు గాయాలు పాలవుతుంటారు. అందుకు ఫెర్గుసన్ కూడా అతీతుడు కాడు. 2012-13 దేశవాళీ సీజన్‌లో కాలికి గాయం అయింది. దీంతో అతడి కెరీర్ ప్రమాదంలో పడింది. అయితే, ఆ తర్వాత అనూహ్యంగా కాలి గాయం నుంచి పుంజుకుని పూర్వ వైభవాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో 145నుంచి 150 kph స్పీడ్‌తో బంతులు సంధిస్తున్నాడు.

Story first published: Monday, June 24, 2019, 18:33 [IST]
Other articles published on Jun 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X