న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంకతో మూడో టెస్ట్: ఆగ్రహంతో డిక్లేర్, వరుసగా కోహ్లీ రెండో 'డబుల్', లారా రికార్డ్ బ్రేక్

3rd Test, Live: Virat Kohli hits record sixth Test double century, second in a row

న్యూఢిల్లీ: ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు (ఆదివారం) ఆట పూర్తయ్యేసరికి భారత్ 405 పరుగుల ఆధిక్యంతో ఉంది. తొలుత భారత్ బ్యాటింగ్ చేసింది. కోహ్లీ జోరుకు రోహిత్‌ శర్మ అర్ధశతకం తోడవ్వడంతో శ్రీలంకతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు సాధించింది.

536/7 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసేసరికి 44.3 ఓవర్లకు 131/3తో నిలిచింది. భారత ఫీల్డర్లు రెెండు క్యాచులు మిస్ చేశారు. ఆటగాళ్లు ఢిల్లీ కాలుష్యం దెబ్బకు మాస్కులు ధరించి ఆట కొనసాగించారు.

ఓవర్ నైట్‌ స్కోరు 371/4తో బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియా 100 ఓవర్లు ముగిసేసరికి మరో వికెట్‌ నష్టపోకుండా 412 పరుగులు చేసింది. కోహ్లీ 287 బంతుల్లో 25 ఫోర్లతో 243 పరుగులు చేశాడు. ఆటగాడిగా సచిన్‌ (6 ద్విశతకాలు), సెహ్వాగ్‌ (6)ను సమం చేశాడు. రోహిత్‌ శర్మ (65; 102 బంతుల్లో 7×4, 2×6)తో కలిసి ఐదో వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

పొల్యూషన్ కారణంగా ఆ పేరుతో శ్రీలంక క్రికెటర్లు ఆటకు పదేపదే అంతరాయం కలిగించారు. కోహ్లీ ఈ మ్యాచ్‌లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు 235ను అధిగమించాడు.

కోహ్లీ డబుల్ సెంచరీలో 20 ఫోర్లు ఉన్నాయి. కోహ్లీ వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. ఇది అతని టెస్ట్ కెరీర్లో ఆరో డబుల్ సెంచరీ. దీంతో ఐదు డబుల్ సెంచరీలతో ఉన్న లారా రికార్డును బ్రేక్ చేశాడు.

తొలి రోజు కోహ్లి పరుగుల ప్రవాహంతో పాటు రికార్డుల మోత కూడా కొనసాగింది. మూడు టెస్టుల సిరీస్‌ మూడు మ్యాచ్‌ల్లోనూ సెంచరీలు బాదిన తొలి అంతర్జాతీయ కెప్టెన్‌గా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. సొంత గడ్డ ఢిల్లీలో అతనికి తొలి సెంచరీ.

ఆ తర్వాత కోహ్లీ నాటకీయంగా డిక్లేర్ చేశాడు.ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందిపడ్డ శ్రీలంక క్రికెటర్లు పదేపదే మ్యాచ్‌కు అంతరాయం కలిగించారు. ఆటను నిలిపివేయాలని అంపైర్లను కోరారు. చివరికి సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్లు లేకపోవడంతో శ్రీలంక మేనేజర్‌, కోచ్‌ వచ్చి అంపైర్లతో చర్చించారు.

శ్రీలంక క్రికెటర్లు పదేపదే ఆడేందుకు అయిష్టం ప్రదర్శిస్తుండటంతో రవిశాస్త్రి అంపైర్లతో మాట్లాడారు. శ్రీలంక ఫీల్డింగ్‌ చేసేందుకు ఇబ్బందిపడితే మేం ఫీల్డింగ్‌ చేస్తామంటూ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో 127.5 ఓవర్లకు జట్టు స్కోరు 536/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి డిక్లేర్‌ చేశాడు.

Story first published: Sunday, December 3, 2017, 18:15 [IST]
Other articles published on Dec 3, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X