న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3rd ODI: క్యాచ్ మిస్, స్టంపౌట్‌తో తప్పుని సరిదిద్దిన ధోని (వీడియో)

India vs Australia : M S Dhoni Corrects Stump Out Mistake During Match | Oneindia Telugu
3rd ODI: Worst Day Behind The Stumps Ever? Twitter Slams Dhoni For Ordinary Wicketkeeping in MCG

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై ప్రస్తుతం జరుగుతున్న మూడు వన్డేల సిరిస్‌లో వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్న ధోని శుక్రవారం మెల్‌బోర్న్‌ వేదికగా ప్రారంభమైన మూడు వన్డేలో ఓ సులువైన క్యాచ్‌ని జారవిడిచాడు. అయితే.. కొద్దిసేపటికే ఆ తప్పిదాన్ని చురుకైన స్టపింగ్‌తో ధోనీ సరిదిద్దుకున్నాడు.

అమ్మకానికి రాజస్థాన్‌ రాయల్స్‌ 50 శాతం వాటా: రేసులో ఉన్నది వీరేఅమ్మకానికి రాజస్థాన్‌ రాయల్స్‌ 50 శాతం వాటా: రేసులో ఉన్నది వీరే

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆతిథ్య జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్ బౌలింగ్‌లో షాన్ మార్ష్ (అప్పటి స్కోరు 26 బంతుల్లో 11 పరుగులు) బంతిని కట్ చేసే ప్రయత్నం చేశాడు. బ్యాడ్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా ధోనీ చేతుల్లోకి వెళ్లింది.

ధోని క్యాచ్ మిస్

అయితే, ఆ బంతిని ధోనీ ఒడిసిపట్టుకోలేకపోయాడు. ధోని చేతుల్లో నుంచి బంతి బౌన్స్ అయ్యి నేలను తాకింది. రెండో వన్డేలో సెంచరీ బాది ఫామ్‌లో ఉన్న షాన్ మార్ష్.. వికెట్ చేజారడంతో బౌలర్ కేదార్ జాదవ్‌తో పాటు కెప్టెన్‌ కోహ్లీ పెదవి విరవడం మైదానంలోని ఎల్‌ఈడీ స్క్రీన్లపై స్పష్టంగా కనిపించింది.

ఇన్నింగ్స్ 24వ ఓవర్‌లో

ఇన్నింగ్స్ 24వ ఓవర్‌లో

ఆ తర్వాత ఇన్నింగ్స్ 24వ ఓవర్‌లో షాన్ మార్ష్‌ని ఔట్ చేసేందుకు చాహల్‌తో కలిసి వ్యూహం రచించిన ధోని.. ఆ తప్పిదాన్ని దిద్దుకున్నాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో మార్ష్ అస్తమానం క్రీజు వెలుపలికి వెళ్లి షాట్ కోసం ప్రయత్నిస్తుండటంతో.. చాహల్‌కి సూచనలు చేసిన ధోని లెగ్‌సైడ్ వైడ్‌ రూపంలో బంతిని విసరాల్సిందిగా సూచించాడు.

దోని ప్లాన్‌ని అర్థం చేసుకోలేని మార్ష్

దోని ప్లాన్‌ని అర్థం చేసుకోలేని మార్ష్

దోని ప్లాన్‌ని అర్థం చేసుకోలేని షాన్ మార్ష్ క్రీజు వెలుపలికి వెళ్లగా.. వైడ్‌ రూపంలో వచ్చిన బంతిని అతికష్టంగా అందుకున్న ధోని చురుగ్గా స్టంపౌట్ చేశాడు. దీంతో 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్ష్ పెవిలియన్‌కు చేరాడు. ఈ సిరిస్‌లో ధోని వరుసగా రెండు వన్డేల్లోనూ రెండు హాఫ్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, January 18, 2019, 11:43 [IST]
Other articles published on Jan 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X