న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సరిగ్గా 11 ఏళ్ల క్రితం: తొలి టెస్టు సెంచరీని నమోదు చేసిన కుంబ్లే

By Nageshwara Rao
Anil Kumble Scores A Century In England And India Match In 2007
11 Years Ago, Anil Kumble Introduced England To Misery, Not With The Ball But By Scoring A Century

హైదరాబాద్: భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు అనిల్ కుంబ్లే. తన స్పిన్‌‌తో భారత జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. 503 మ్యాచ్‌లాడిన కుంబ్లే తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో ఇంగ్లాండ్ జట్టుపై సెంచరీని కూడా నమోదు చేశాడు. తన టెస్టు కెరీర్‌లో కుంబ్లే బాదిన ఏకైక సెంచరీ ఇదే కావడం విశేషం.

అనిల్‌ కుంబ్లే సెంచరీ నమోదు చేసి ఈ రోజుకు సరిగ్గా పదకొండేళ్లు. 2007 ఆగస్టు 10న కుంబ్లే ఓవల్‌ మైదాంనలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సహచర ఆటగాళ్లు ఔటవ్వకుండా మరింత సహకారం అందిస్తే కుంబ్లే మరిన్ని పరుగులు చేసే ఉండేవాడు.

ద్రవిడ్‌ నాయకత్వంలో ఇంగ్లాండ్ పర్యటనకు

ద్రవిడ్‌ నాయకత్వంలో ఇంగ్లాండ్ పర్యటనకు

2007 జులైలో రాహుల్‌ ద్రవిడ్‌ నాయకత్వంలో టీమిండియా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. లార్డ్స్‌ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. అనంతరం నాటింగ్‌‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఆగస్టు 9న ఓవల్ వేదికగా మూడో టెస్టు

ఆగస్టు 9న ఓవల్ వేదికగా మూడో టెస్టు

ఓవల్‌ వేదికగా ఆగస్టు 9న ఇరు జట్ల మధ్య ఈ సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టు ప్రారంభమైంది. ఈ టెస్టులో టాస్‌ గెలిచిన రాహుల్ ద్రవిడ్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్‌ దినేశ్‌ కార్తీక్‌(91), రాహుల్ ద్రవిడ్‌(55), సచిన్‌ చెండూల్కర్ (82), వీవీఎస్‌ లక్ష్మణ్‌ (51), ధోనీ(92) పరుగులతో రాణించారు.

ఆగస్టు 10న సెంచరీ నమోదు చేసిన కుంబ్లే

ఆగస్టు 10న సెంచరీ నమోదు చేసిన కుంబ్లే

వీరంతా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అనిల్ కుంబ్లే రెండో రోజు ఆటలో(ఆగస్టు 10న) భాగంగా సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 193 బంతులు ఎదుర్కొన్న కుంబ్లే 16 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జట్టు స్కోరు 664 పరుగుల వద్ద శ్రీశాంత్‌ ఔటవ్వడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది.

రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 5 వికెట్లు తీసిన కుంబ్లే

ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కుంబ్లేకు 5 వికెట్లు కూడా దక్కాయి. దీంతో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌ డ్రాగా ముగియడంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 1-0తో కైవసం చేసుకుంది. ప్రస్తుతం కోహ్లీసేన కూడా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోండటంతో కుంబ్లే సెంచరీని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

 1990లో భారత్‌ తరఫున అరంగేట్రం

1990లో భారత్‌ తరఫున అరంగేట్రం

కాగా, 1990లో భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన అనిల్‌ కుంబ్లే టెస్టుల్లో తొలి సెంచరీని సాధించడానికి 17 ఏళ్లు పట్టింది. కుంబ్లే తన 389వ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. భారత్‌ తరఫున పెద్ద వయస్సులో సెంచరీ సాధించిన రికార్డు కూడా కుంబ్లే పేరిట ఉంది. 36ఏళ్ల 296 రోజుల వయస్సులో కుంబ్లే సెంచరీ సాధించాడు. 2007లో వన్డేలకు, 2008లో టెస్టులకు కుంబ్లే వీడ్కోలు పలికాడు.

Story first published: Friday, August 10, 2018, 14:06 [IST]
Other articles published on Aug 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X