న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో మైలురాయికి 33 పరుగుల దూరంలో ధోని: సచిన్, గంగూలీ, ద్రవిడ్‌‌ల సరసన

By Nageshwara Rao
Dhoni Set To Join Indian Legends In This Elite Club
10000 Runs: MS Dhoni Set To Join Tendulkar, Ganguly, Dravid In This Elite Club

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని వన్డేల్లో మరో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. వన్డేల్లో ధోని ఇంకా 33 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 10 పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 12వ ఆటగాడిగా... భారత్‌ తరఫున నాలుగో ఆటగాడిగా ధోని రికార్డు సాధించనున్నాడు.

ప్రస్తుతం ధోని ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో కోహ్లీసేన గురువారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. నాటింగ్‌హామ్ వేదికగా తొలి వన్డే జరగనుంది. ఈ వన్డేలో ధోని 33 పరుగులు చేస్తే, పదివేల పరుగుల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

వన్డేల్లో 9,967 పరుగులు చేసిన ధోని

వన్డేల్లో 9,967 పరుగులు చేసిన ధోని

ప్రస్తుతం ధోనీ వన్డేల్లో 9,967 పరుగులు సాధించాడు. తొలి వన్డేలో ధోని మిగతా పరుగులు సాధిస్తే, భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీల సరసన నిలుస్తాడు. భారత్ తరుపున ఈ ముగ్గురూ వన్డేల్లో పదివేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు.

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ భారత్ తరుపున 18426 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర (12234), ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్ (13704), శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య (13430), శ్రీలంకకు చెందిన మహిళా జయవర్దనే(12650) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

10వేల పరుగుల మైలురాయిని అందుకునే రెండో వికెట్ కీపర్

10వేల పరుగుల మైలురాయిని అందుకునే రెండో వికెట్ కీపర్

వన్డేల్లో ధోని పదివేల పరుగుల మైలురాయిని అందుకునే రెండో వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ కానున్నాడు. శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. తన కెరీర్‌లో ధోని అందుకోబోయే అత్యుత్తమ రికార్డుల్లో ఇది ఒకటి. వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు(297) అందుకున్న నాలుగో వికెట్ కీపర్‌గా ధోని ఉన్నాడు.

 ధోనితో పాటు ఈ సిరిస్‌లో మరికొంతమంది ఆటగాళ్లు

ధోనితో పాటు ఈ సిరిస్‌లో మరికొంతమంది ఆటగాళ్లు

అందుకునే మైలురాళ్లు ఇవే:

* విరాట్‌ కోహ్లీ ఇప్పటి వరకు వన్డేల్లో 893 ఫోర్లు బాదాడు. మరో ఏడు ఫోర్లు కొడితే వన్డే క్రికెట్లో 900 ఫోర్లు కొట్టిన 18వ ఆటగాడు అవుతాడు. భారత్‌ తరఫున ఆరోగాడు అవుతాడు.

* సురేశ్‌ రైనా మూడు ఫార్మాట్లలో కలిపి 8వేల పరుగులు సాధించిన 15వ భారత ఆటగాడిగా రికార్డుకెక్కడానికి కావాల్సిన పరుగులు 59.

* భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మరో 38 పరుగులు చేస్తే లిస్ట్‌-ఏ క్రికెట్లో వెయ్యి పరుగుల మైలురాయిని అందుకుంటాడు.

* స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్ వన్డేల్లో 50 వికెట్ల క్లబ్‌లో చేరేందుకు ఐదు వికెట్ల దూరంలో ఉన్నాడు.

Story first published: Wednesday, July 11, 2018, 19:24 [IST]
Other articles published on Jul 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X