న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

10 ఆసక్తికర విషయాలు: సిద్ధమవుతోన్న అతిపెద్ద క్రికెట్ స్టేడియం

10 Things You Need to Know About the Worlds Largest Cricket Stadium Being Built in Ahmedabad

హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని మొతేరా వద్ద ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్య మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ స్టేడియం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ప్రస్తుతం ఈ స్టేడియం ఫొటోలను గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పరిమల్ నత్వాని ఆదివారం ట్వీట్ చేశారు.

అనుష్కతో కలిసి సిడ్నీ మైదానంలో విరాట్ కోహ్లీ 'విక్టరీ వాక్' (వీడియో)అనుష్కతో కలిసి సిడ్నీ మైదానంలో విరాట్ కోహ్లీ 'విక్టరీ వాక్' (వీడియో)

గుజరాత్ క్రికెట్ ఆసోసియేషన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆయన తన ట్విట్టర్‌లో కామెంట్ పెట్టారు. ఈ స్టేడియం పూర్తయితే, దేశానికే తలమానికంగా నిలుస్తుందని చెప్పారు. అయితే, ప్రస్తుతానికి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా గుర్తుంపు పొందుతుంది.

మొతేరా క్రికెట్ స్టేడియం విశేషాలను ఒక్కసారి పరిశీలిస్తే:

1. స్టేడియం నిర్మాణానికి 2018 జనవరిలో శంకుస్థాపన జరిగింది.
2. ఈ స్టేడియం నిర్వహణ ప్రస్తుత ప్రధాన మంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఆలోచన. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేడియం నిర్మాణం జరుపుకుంటోంది.
3. ఈ స్టేడియాన్ని ప్రముఖ ఆర్చిటెక్చర్ సంస్థ పాపులస్ డిజైన్ చేసింది. నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీ సంస్థ చేజిక్కించుకుంది.
4. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా ఉన్న మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంను కూడా పాపులస్ సంస్థే డిజైన్ చేసింది.
5. మొత్తం 63 ఎకరాల స్థలంలో నిర్మిస్తోన్న ఈ స్టేడియంలో ఒకేసారి 1.10 లక్షల మంది కూర్చోవచ్చు. మెల్‌బోర్న్ స్టేడియం కెపాసిటీ 90వేలు.
6. ఈ స్టేడియం నిర్మాణానికి అయ్యే ఖర్చు సుమారు రూ.700 కోట్లు.
7. ఈ స్టేడియంలో మొత్తం నాలుగు డ్రెస్సింగ్ రూమ్‌లు ఉంటాయి. 50 గదులతో క్లబ్ హౌస్ ఉంటుంది.
8. 76 కార్పోరేట్ బాక్సులు, పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. ఇందులోనే ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ అకాడమీ కూడా ఉంటుంది.
9. ఈ స్టేడియంలో మూడువేల కార్లు, పదివేల మోటార్ సైకిళ్లు పార్కింగ్ చేసుకునే సామర్థ్యం ఉంటుంది.
10. పాత మొతేరా స్టేడియంలో కేవలం 54వేల మంది కూర్చునే సామర్థ్యం మాత్రమే ఉండేది. దానిని 2016లో కూల్చివేశారు.

Story first published: Monday, January 7, 2019, 15:53 [IST]
Other articles published on Jan 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X