న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

10 రోజుల వ్యవధిలో 4 ఇన్నింగ్స్‌ విజయాలు.. టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు!!

10 Days 4 Innings Victories,New Record In Test Cricket ! || Oneindia Telugu
10 days 4 innings victories: India, Australia and New Zealand combined to script a unique first in Test cricket

కోల్‌కతా: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 5 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. ఇందులో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు కూడా భాగమయ్యాయి. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టులను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేయడంతో పాటు ఇన్నింగ్స్‌ విజయాలను నమోదు చేసింది.

<strong>జట్టులో కనీస గౌరవం కూడా దక్కడం లేదు.. క్రిస్ గేల్ ఆవేదన!!</strong>జట్టులో కనీస గౌరవం కూడా దక్కడం లేదు.. క్రిస్ గేల్ ఆవేదన!!

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ విజయం

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ విజయం

బంగ్లా-భారత్ జట్ల మధ్య నవంబర్‌ 14వ తేదీన తొలి టెస్టు ఆరంభం కాగా.. 16వ తేదీన ముగిసింది. మూడో రోజే భారత్‌ ఇన్నింగ్స్‌ విజయాన్ని సాధించింది. ఇక కోల్‌కతా వేదికగా జరిగిన రెండో టెస్టు నవంబర్‌ 22వ తేదీన ఆరంభం కాగా.. 24వ తేదీన ముగిసింది. పాక్‌పై ఇన్నింగ్స్‌ తేడాతో ఆసీస్‌ గెలిచిన మ్యాచ్‌.. నవంబర్‌ 21వ తేదీ నుంచి 23 వరకూ జరిగింది. మరొకవైపు ఇంగ్లండ్‌తో నవంబర్‌ 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ మ్యాచ్‌ జరగ్గా.. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ విజయాన్ని అందుకుంది.

టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు

టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు

10 రోజుల వ్యవధిలో నాలుగు ఇన్నింగ్స్‌ విజయాలు రావడంతో టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. గతంలో ఒకేసారి నాలుగు ఇన్నింగ్స్‌ విజయాలు వచ్చినప్పటికీ.. 10 రోజుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ గెలుపులు రావడం ఇదే తొలిసారి. 2002లో 11 రోజుల వ్యవధిలో నాలుగు ఇన్నింగ్స్‌ విజయాలు నమోదయ్యాయి. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఆ రికార్డును భారత్‌-ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లు బద్దలు కొట్టాయి.

వరుసగా ఏడో టెస్టు విజయం

వరుసగా ఏడో టెస్టు విజయం

విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా వరుసగా ఏడో టెస్టు విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను కూడా వైట్‌వాష్‌ చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌పై కూడా రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. మరోవైపు వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ విజయాలతో సరికొత్త రికార్డును కూడా నెలకొల్పింది.

టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానం

టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానం

360 టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని టీమిండియా మరింత పట్టిష్టం చేసుకుంది. వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌లో భారత్‌ పర్యటించనుంది. ప్రస్తుతం ఆసీస్‌ 116 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.న్యూజిలాండ్, శ్రీలంక చెరో 60 పాయింట్లతో పట్టికలో వరుసగా మూడో, నాలుగో స్థానాల్లో ఉన్నాయి.. ఇంగ్లండ్‌ 56 పాయింట్లతో ఉంది. పాకిస్థాన్‌ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో తొలి సిరీస్‌ను ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఆడుతోంది. బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా తమ తొలి సిరీస్‌లో పాయింట్లు దక్కించుకోలేకపోయాయి.

Story first published: Tuesday, November 26, 2019, 15:05 [IST]
Other articles published on Nov 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X