Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాట పాడిన మేరీ కోమ్: నెటిజన్లు ఫిదా, ప్రశంసల వర్షం (వీడియో)

Watch video: Mary Kom singing Ajeeb Dastan will hit you right in the feels

హైదరాబాద్: ఇటీవలే ఢిల్లీ వేదికగా ముగిసిన మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిలో ఆరోసారి స్వర్ణం గెలిచి భారత స్టార్ బాక్సర్ మెరీ కోమ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తన పంచ్‌లతో ప్రత్యర్థులను కట్టడి చేసే మేరీ కోమ్ తనలో మరోక టాలెంట్ ఉందని నిరూపించింది.

ఓ కార్యక్రమంలో గానకోకిల లతా మంగేష్కర్‌ పాటను అద్భుతంగా పాడి అక్కడున్న వారిని మేరీ కోమ్ ఆశ్చర్యపరిచింది. 1960లో వచ్చిన 'దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయి' సినిమాలో లతా మంగేష్కర్‌ పాడిన 'అజైబ్ దస్తాన్ హై యెహ్' పాటను మేరీ కోమ్ ఈ సందర్భంగా పాడారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మేరీ కోమ్ పాటకు ఫిదా అయిన నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'ఆమె బాక్సింగ్ చేయగలదు, అలాగే పాట కూడా పాడగలదు, అమేజింగ్ మేరీ..', 'చాలా గర్వంగా ఉంది మిసెస్‌ మేరీకోమ్' అంటూ నెటిజన్లు ఆమెను పొగుడుతున్నారు.

Story first published: Friday, November 30, 2018, 18:57 [IST]
Other articles published on Nov 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+