న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇదెక్కడి న్యాయం!: మేరీ కోమ్ కోసం నిఖత్ జరీన్ కెరీర్‌‌ను ఫణంగా!

In sport, yesterday never counts: Abhinav Bindra backs Zareens demand for trial vs Mary Kom

హైదరాబాద్: ఒలింపిక్స్ టోర్నీ ప్రతి ఒక్క అథ్లెట్ ఆడాలనుకునే టోర్నీ. అలాంటి టోర్నీలో స్టార్ బాక్సర్‌ మేరీ కోమ్‌ కోసం రెండోసారి తన కెరీర్‌ను పక్కన పెట్టిన వైనంపై హైదరాబాద్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ఆవేదన వ్యక్తంజేసింది. సెలెక్షన్స్‌ నిర్వహించకుండా టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీకి మేరీని పంపాలనుకుంటున్న భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) తీరుపై కేంద్ర క్రీడల మంత్రి కిరెన్‌ రిజిజుకు లేఖ రాసింది.

2020లో జరిగే ఒలింపిక్స్‌కు జపాన్ రాజధాని టోక్యో ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో పాల్గొనేందుకు గాను వచ్చే ఫిబ్రవరిలో ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ పోటీలు చైనాలో జరుగుతాయి. ఇందులో పాల్గొనే బాక్సర్లను ట్రయల్స్‌ ద్వారా ఎంపిక చేయాలి. కానీ, భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీబీఎఫ్‌) మాత్రం ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన విజేతలను నేరుగా ఎంపిక చేసింది.

భారత బౌలింగ్ దళం అద్భుతం.. ఒకప్పటి వెస్టిండీస్ బృందాన్ని తలపిస్తోంది!!భారత బౌలింగ్ దళం అద్భుతం.. ఒకప్పటి వెస్టిండీస్ బృందాన్ని తలపిస్తోంది!!

ఇటీవల రష్యాలోని ఉలాన్‌ ఉదెలో ముగిసిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 51 కేజీల విభాగంలో మేరీకోమ్‌ కాంస్య పతకం సాధించింది. అయితే టోక్యో ఒలింపిక్స్‌ కోసం మేరీ 48 కేజీల విభాగం నుంచి 51 కేజీలకు మారింది. ఇదే ఇప్పుడు నిఖత్‌ జరీన్‌కు శాపంగా మారింది. మొదటి నుంచీ 51 కేజీల బరిలో రాణిస్తోన్న నిఖత్‌ జరీన్‌కు మేరీ అడ్డుగా మారింది.

మేరీ కోమ్ స్టార్ బాక్సర్ కావడంతో భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీబీఎఫ్‌) ఆమెకే మద్దతుగా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ కోసం భారత్‌ తరఫున మేరీకోమ్‌ను పంపాలనుకుంటున్నట్లు బీఎఫ్‌ఐ అధ్యక్షుడు అజయ్‌సింగ్‌ చెప్పకనే చెప్పాడు. దీంతో తాను పోటీ పడే 51 కేజీల విభాగంలో సెలక్షన్‌ ట్రయల్సే లేకుండా మేరీకోమ్‌ను నేరుగా పంపడాన్ని నిఖత్ జరీన్ ప్రశ్నించింది.

ప్రపంచకప్ ఆతిథ్యానికి భారత్ బిడ్.. పోటీలో బెల్జియం, మలేషియా!!ప్రపంచకప్ ఆతిథ్యానికి భారత్ బిడ్.. పోటీలో బెల్జియం, మలేషియా!!

ఈ మేరకు తన ట్విట్టర్‌లో "ఆగస్టు 6, 7 తేదీల్లో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ సెలెక్షన్స్‌ నిర్వహిస్తామని ఢిల్లీకి పిలిచారు. చివరి నిమిషంలో సెలెక్షన్స్‌ను రద్దుచేసి మేరీ కోమ్‌ను టోర్నీకి పంపించారు. ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, రజతం సాధించిన క్రీడాకారులకు ఒలింపిక్‌ సెలెక్షన్స్‌ నుంచి మినహాయింపు ఉంటుందని చెబుతున్నారు. మేరీ కోమ్‌ కోసం సెలెక్షన్స్‌ లేకుండా నిబంధనను మార్చి ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీకి ఎంపిక చేస్తున్నారని తెలిసింది. ప్రతిసారీ తమను తాము నిజాయతీగా నిరూపించుకోవాలన్నది క్రీడల్లో ప్రాథమిక సూత్రం. క్రీడలంటేనే పారదర్శకతకు పేరు. ట్రయల్స్‌ లేకుండానే నన్ను పక్కనబెట్టడం సరైంది కాదు. 23 ఒలింపిక్స్‌ స్వర్ణాలు సాధించిన అమెరికన్ స్విమ్మర్‌ మైకేల్‌ ఫెల్ప్స్‌ కూడా ట్రయల్స్‌ ద్వారానే తిరిగి దేశం తరఫున పాల్గొన్నాడు. మనం కూడా అలాగే చేయాలి కదా. అందుకే నాకొక అవకాశం ఇప్పించండి. అదే జరగకపోతే నా శిక్షణకు అర్థమేముంది. మేరీకోమ్‌ అయినా మరెవరైనా ట్రయల్స్‌ ద్వారా ఎంపికైతేనే మంచిది" అని కేంద్ర క్రీడల మంత్రికి రాసిన లేఖను ట్వీట్ చేసింది.



ఒలింపిక్స్‌ ట్రయల్స్‌ పెట్టకపోవడాన్ని ప్రశ్నించిన నిఖత్‌ జరీన్‌కు మాజీ క్రీడాకారుల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత అభినవ్‌ బింద్రా మద్దతు పలికాడు. "మేరీకోమ్‌ అంటే నాకెంతో గౌరవం ఉంది. అథ్లెట్‌ జీవితమనేది సాక్ష్యం కోరుకుంటుంది. వాస్తవం మాట్లాడుకుంటే ఏ అథ్లెట్‌కైనా వారి ప్రస్తుత ప్రదర్శన పైనే కెరీర్‌ ఆధారపడి ఉంటుంది. వాళ్ల ప్రదర్శన ప్రస్తుతం గతంలోలా ఉండకపోవచ్చు. గతం అనేది క్రీడల్లో లెక్కలోకి రాదు" అని బింద్రా ట్వీట్‌ చేశాడు.
Story first published: Friday, October 18, 2019, 13:14 [IST]
Other articles published on Oct 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X