న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సయ్యద్ మోడీ చాంపియన్‌షిప్‌: విజేత సమీర్ వర్మ, రన్నరప్‌గా సైనా

Syed Modi International: Sameer Verma retains title; Han Yue stuns Saina Nehwal

హైదరాబాద్: సయ్యద్ మోడీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ ఆటగాడు సమీర్‌వర్మ ఛాంపియన్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో మూడో సీడ్‌ సమీర్‌ 16-21, 2-19, 21-14తో ఆరో సీడ్‌ గ్వాంగ్జు లు (చైనా)పై విజయం సాధించాడు.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సమీర్ వర్మ ఒక గంటా 10 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో తొలి గేమ్‌ను కోల్పోయినా, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌ హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సైనా నెహ్వాల్‌ రన్నర్‌పగా నిలిచి నిరాశపరిచింది.

చైనాకు చెందిన 19 ఏళ్ల యువ షట్లర్ హాన్ యు 18-21, 8-21 స్కోరుతో వరుస గేముల్లో ఓటమిపాలైంది. తొలిగేమ్‌లో హోరాహోరీగా పోరాడినా.. రెండోగేమ్‌లో సైనా పూర్తిగా చేతులెత్తేసింది. కేవలం 8 పాయింట్లే సాధించి పూర్తిగా నిరాశ పరిచింది.

పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ జోడీ 11-21, 20-22తో ఫజర్‌ అల్ఫియాన్‌-మహమ్మద్‌ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు మహిళల డబుల్స్‌లో టాప్‌సీడ్‌గా అడుగు పెట్టిన అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి జోడీ 15-21, 13-21 తేడాతో మలేసియాకు చెందిన లీమెంగ్ యిన్, చోమీకున్ జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు.

Story first published: Monday, November 26, 2018, 9:08 [IST]
Other articles published on Nov 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X