న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సయ్యద్ మోడీ టోర్నీ: ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్ vs కశ్యప్!!

Syed Modi international: Kidambi Srikanth, Sai Praneeth, HS Prannoy enters 2nd round

లక్నో: వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 300 టోర్నమెంట్‌ సయ్యద్‌ మోదీ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్లు శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్‌ ప్రణయ్, జాతీయ చాంపియన్‌ సౌరభ్‌ వర్మ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పోటీకి ముందే ప్రత్యర్థులు వైదొలగడంతో పారుపల్లి కశ్యప్, లక్ష్యసేన్ కూడా ప్రిక్వార్టర్స్‌కు చేరారు.

జనవరి వరకు ఏం అడగొద్దు.. రిటైర్మెంట్‌పై స్పందించిన ధోనీ!!జనవరి వరకు ఏం అడగొద్దు.. రిటైర్మెంట్‌పై స్పందించిన ధోనీ!!

బుధవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్‌ 21-16, 22-20 తేడాతో ఇస్కందర్ జుల్కర్‌నైన్ (మలేషియా)పై గెలిచాడు. ఇక

ప్రిక్వార్టర్స్‌లో కున్లావుట్ (థాయ్‌లాండ్)తో అతడు పోటీ పడనున్నాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన హెచ్‌ఎస్ ప్రణయ్ 18-21, 22-20, 21-13తో లీ షీ ఫెంగ్(చైనా)పై పోరాడి గెలిచాడు. ఎనిమిదో సీడ్ వాంగ్ జూ వీ (చైనీస్ తైపీ)ని ప్రణయ్ ఢీకొననున్నాడు.

మూడో సీడ్ శ్రీకాంత్ 21-12, 12-11తో వ్లాదిమిర్ మాల్కోవ్ (రష్యా)పై 36 నిమిషాల్లోనే సునాయాస విజయం సాధించాడు. లుకావ్ కోర్వీ (ఫ్రాన్స్) పోటీకి ముందే టోర్నీ నుంచి తప్పుకోవడంతో కశ్యప్ ముందడుగేశాడు. ఇక ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్-కశ్యప్ పరస్పరం పోటీ పడనున్నారు. ఇద్దరు భారత ఆటగాళ్లలో ఒక్కరు మాత్రమే తదుపరి రౌండ్‌కు వెళ్లానున్నారు.

ప్రత్యర్థి థామస్ రౌక్సెల్ (ఫ్రెంచ్) వాకోవర్‌గా వెనుదిరగడంతో యువ షట్లర్ లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్‌ చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్ సన్ వాన్‌హో (కొరియా)తో పోరుకు లక్ష్యసేన్ సిద్ధమయ్యాడు. సౌరభ్ వర్మ, అజయ్ జైరాం, సిరిల్ వర్మ కూడా తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో అష్మిత చలిహ, రితుపర్ణ దాస్, తన్వి లాడ్ ప్రత్యర్థులపై విజయాలు సాధించి ప్రిక్వార్టర్స్‌కు చేరారు.

ఏడు వికెట్లతో చెలరేగిన విండీస్‌ 'బాహుబలి' కార్న్‌వాల్‌.. మూడో బౌలర్‌గా రికార్డు!!ఏడు వికెట్లతో చెలరేగిన విండీస్‌ 'బాహుబలి' కార్న్‌వాల్‌.. మూడో బౌలర్‌గా రికార్డు!!

భారత పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి - చిరాగ్ శెట్టి స్వదేశంలో నిరాశపరిచారు. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సాత్విక్ జోడీ తొలి రౌండ్‌లో 12-21, 21-23తేడాతో చైనా ద్వయం డి జి జియాన్-వాంగ్ చెంగ్ చేతిలో ఓడిపోయారు. మహిళల డబుల్స్‌లో ఎన్ సిక్కిరెడ్డి-అశ్వినీ పొన్నప్ప 21-13, 16-21, 21-19తో యెన్ సిన్‌యింగ్-యావూపై గెలిచి ప్రిక్వార్టర్స్‌ చేరుకున్నారు.

Story first published: Thursday, November 28, 2019, 11:41 [IST]
Other articles published on Nov 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X