క్యాన్సర్ రోగుల కోసం భారీ విరాళాన్ని అందజేసిన పీవీ సింధు

Posted By: Subhan
Sindhu donates KBC prize money

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పేద క్యాన్సర్ రోగులకు అండగా నిలిచింది. కౌన్ బనేగా కరోడ్‌పతిలో తాను గెలుచుకున్న రూ. 25 లక్షల నగదు బహుమతిని వారికి అందజేసింది. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ దవాఖాన వేదికగా విరాళాన్ని ఇచ్చింది.

శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన చెక్‌ను దవాఖాన చైర్మన్ నందమూరి బాలకృష్ణకు అందజేసింది. పేద క్యాన్సర్ రోగులకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయాల్సిందిగా సింధు సూచించింది. డబ్బులు గెలిచినప్పుడు క్యాన్సర్ రోగులకు విరాళంగా ఇస్తానని బాలీవుడ్ నటుడు అమితాబ్‌కు మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇదే మాటను ఈ సందర్భంగా సింధు నిలబెట్టుకుంది. కాగా, ఈ విషయాన్ని ఆమె తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పొందుపరిచింది.

ఈ కార్యక్రమంలో సింధు తల్లిదండ్రులు రమణ, విజయతో పాటు మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్, ఆస్పత్రి సీఈవో డా.ప్రభాకర్‌రావు, మెడికల్ డైరెక్టర్ డా.టీఎస్,.రావు, సీవోవో బీ.కృష్ణమూర్తి,మెడికల్ సూపరిండెంట్ డా.కల్పనా రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.

Story first published: Saturday, January 13, 2018, 13:12 [IST]
Other articles published on Jan 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి