న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అట్టహాసంగా క్రీడా పురస్కారాల ప్రదానం: సాయి ప్రణీత్‌కు అర్జున అవార్డు

Shuttler Sai Praneeth receives Arjuna Award from President Ram Nath Kovind

హైదరాబాద్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా స్టార్ షట్లర్, తెలుగు తేజం సాయి ప్రణీత్ అర్జున అవార్డుని అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ క్రీడా పురస్కారాలు అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ ఖేల్ రత్నఅవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్రపతి అవార్డులను అందజేశారు.

హాక్ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆగస్టు 29ని ప్రతి ఏటా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి భవన్‌లో ఈరోజున ఉత్తమ క్రీడాకారులకు, కోచ్‌లకు క్రీడాపురస్కారాలు ఇచ్చి గౌరవించడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా 2018 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలు గెల్చుకున్న ఆటగాళ్లు అవార్డులు స్వీకరించారు.

మహిళా పారాథ్లెట్‌ దీపా మాలిక్‌లు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం 'రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న' రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ 'అర్జున అవార్డు'ను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. సాయిప్రణీత్‌, కబడ్డీ ప్లేయర్ అజయ్ ఠాకూర్‌తో పాటు మరో 17 మందికి అర్జున పురస్కారాలకు ఎంపికయ్యారు.

ఖేల్ రత్న అవార్డు గ్రహీతలు:
దీపా మాలిక్(పారా-అథ్లెటిక్స్)
బజరంగ్ పూనియా(రెజ్లింగ్)

అర్జున అవార్డు గ్రహీతలు:
రవీంద్ర జడేజా(క్రికెట్)
మహమ్మద్ అనాస్ యాహియా(అథ్లెటిక్స్)
గురుప్రీత్ సింగ్ సంధు(ఫుట్‌బాల్)
సోనియా లాథర్(బాక్సింగ్)
చింగ్‌లెన్సెనా సింగ్(హాకీ)
భాస్కరన్(బాడీ బిల్డింగ్)
అజయ్ థాకూర్(కబడ్డీ)
అంజుమ్ మౌడ్గిల్(షూటింగ్)
సాయి ప్రణీత్(బ్యాడ్మింటన్)
తాజేందర్ పాల్ సింగ్(టేబుల్ టెన్నిస్)
పూజా దండా(రెజ్లింగ్)
ఫౌడా మీర్జా(ఈక్వెస్ట్రియన్)
సిమ్రాన్ సింగ్ షేర్‌గిల్(పోలో)
పూనమ్ యాదవ్(క్రికెట్)
స్వప్న బర్మన్(అథ్లెటిక్స్)
సుందర్ సింగ్ గుజార్(పారా స్పోర్ట్స్ అథ్లెటిక్స్)
గౌరవ్ సింగ్ గిల్( మోటార్ స్పోర్ట్స్).

ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు(రెగులర్ కేటగిరీ):
మోహిందర్ సింగ్ థిల్లాన్(అథ్లెటిక్స్)
సందీప్ గుప్తా(టేబుల్ టెన్నిస్)
విమల్ కుమార్(బ్యాడ్మింటన్)

ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు(లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్):
సంజయ్ భరద్వాజ్(క్రికెట్)
రాంబీర్ సింగ్ కొక్కార్(కబడ్డీ)
మెజ్బాన్ పటేల్(హాకీ)

ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలు:
మనోజ్ కుమార్(రెజ్లింగ్)
లాల్‌రెమ్ సంగా(ఆర్చెరీ)
అరూప్ బాసక్(టేబుల్ టెన్నిస్)
మాన్యూల్ ఫెడ్రిక్స్

Story first published: Thursday, August 29, 2019, 19:43 [IST]
Other articles published on Aug 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X