న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింధూ అలా ఆడటం వల్లే కలిసొచ్చింది: గోపీచంద్

Relaxed mind helped PV Sindhu win title: Pullela Gopichand

హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్‌ గెలిచి ఫైనల్ ఫోబియా లేదని నిరూపించుకుంది పీవీ సింధు. ఆమె విజయం పట్ల తల్లిదండ్రులతో పాటుగా సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం పట్ల తనకు ఎంతో గర్వంగా ఉందని కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు. ఈ ఒక్క టైటిల్ ఆమె బ్యాడ్మింటన్‌ కెరీర్‌ను మార్చేసిందని అభిప్రాయపడ్డారు. సింధు తన అంచనాలను అందుకుందన్నారు. ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో గోపీచంద్‌ ప్రస్తావించారు.

ఎప్పుడో అంచనాలను అందుకుంది

ఎప్పుడో అంచనాలను అందుకుంది

‘ఈ మధ్య సింధుకు సరిగా విశ్రాంతి లేదు. తనకు తగిన విశ్రాంతి ఉంటే కోర్టులో బాగా ఆడగలదు. పతకాలు గెలవగలదు. ఈ సారి టోర్నీలో ప్రశాంతతో ఆడటం వల్లనే సాధించగలిగింది. ఫైనల్స్‌లో ఒత్తిడి సర్వసాధారణం. ఆమె ఫైనల్స్‌లో ఆడటమే నాకు సంబంధించి చాలా గొప్ప విషయం. ఆమె కూడా గెలుపు ఓటములను ఎక్కువగా పట్టించుకోదు. కానీ బయటి వారి విమర్శలకు అప్పుడప్పుడూ కాస్త స్పందిస్తూ ఉంటుంది. నాకు తెలిసి సింధు ఎప్పుడో నా అంచనాలను అందుకుంది. ఈ టైటిల్‌తో తనలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగినట్లు అయింది.

ఫామ్ గెలుచుకునేందుకు ఇంకాస్త కష్టంగానే

ఫామ్ గెలుచుకునేందుకు ఇంకాస్త కష్టంగానే

సింధు ఇకపై మరిన్ని రికార్డులు సొంతం చేసుకోగలదని విశ్వసిస్తున్నాను. ఇక కిదాంబి శ్రీకాంత్‌, ప్రణయ్‌ విషయానికొస్తే ఫామ్ గెలుచుకునేందుకు వారిద్దరికీ ఇంకాస్త కష్టంగానే గడిచింది. గతేడాది శ్రీకాంత్‌ ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. శ్రీకాంత్‌కి ఎంతో ప్రతిభ ఉంది. కాకపోతే ఈ ఏడాది శ్రీకాంత్‌ ఎన్నోసార్లు గాయాలపాలయ్యాడు. ప్రణయ్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రణయ్‌ బాగా శ్రమిస్తాడు. వీళ్లందరి విషయంలో ఇప్పుడు ఎంతో సంతృప్తిగా ఉన్నాను.

టైటిల్‌ పోరులో యమగూచి ఓటమితో

టైటిల్‌ పోరులో యమగూచి ఓటమితో

2018లో ప్రపంచ చాంపియన్‌షిప్‌, ఆసియా గేమ్స్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌, థాయ్‌లాండ్‌ ఓపెన్‌, ఇండియా ఓపెన్‌ల్లో సింధు ఫైనల్స్‌కు చేరుకున్నా కేవలం రెండో స్థానంతో సరిపెట్టుకుంది. గతంలో భారత్‌ నుంచి బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టోర్నిలో 2009లో జ్వాలగుత్తా-వి డిజు జోడీ, 2011లో సైనా నెహ్వాల్‌ ఫైనల్‌కు అర్హత సాధించారు. గతేడాది టైటిల్‌ పోరులో యమగూచి చేతిలో ఒటమితో రన్నరప్‌గా నిలిచిన సింధూ ఈసారి టైటిల్‌ గెలిచి తన కలను నిజం చేసుకుంది. ఈ ఏడాదిలో సింధుకు తొలి టైటిల్‌ ఇదే కావడం విశేషం. సింధు ఆదివారం మాత్రం ఈ టైటిల్‌ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా అరుదైన ఘనత సాధించింది.

Story first published: Friday, December 21, 2018, 18:39 [IST]
Other articles published on Dec 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X