న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఛాంపియన్‌షిప్‌ కోసం సింధు జిమ్‌లో ఎలాంటి వర్కౌట్లు చేసిందంటే!! (వీడియో)

PV Sindhus Workout Video for World Championship, Leaves Anand Mahindra Exhausted


ముంబై: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రపంచఛాంపియన్‌ అయిన సింధుపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. అయితే బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కోసం సింధు ఏ స్థాయిలో కష్టపడిందో చూపుతున్న ఓ వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేశారు.

సందీప్ పాటిల్ పేరుతొ నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా.. బీసీసీఐ పెద్దల ఫోన్‌ నంబర్లు ట్రాప్సందీప్ పాటిల్ పేరుతొ నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా.. బీసీసీఐ పెద్దల ఫోన్‌ నంబర్లు ట్రాప్

జిమ్‌లో చమటోడ్చిన సింధు:

ఆనంద్ మహీంద్రా షేర్‌ చేసిన వీడియోలో సింధు ఎంతో కష్టపడుతూ కనిపించింది. జిమ్‌లో వివిధ వర్కౌట్లు చేస్తూ చమటోడ్చింది. జిమ్‌లో అధిక బరువులు, జంపింగ్స్ చేసింది. ముఖ్యంగా చేతులు, కాళ్ళకు సంబందించిన వ్యాయామాలు ఎక్కువగా సాధన చేసింది. ఛాంపియన్‌షిప్‌ కోసం సింధు ప్రత్యేక శిక్షకుడి సమక్షంలో చాలానే కష్టపడినట్టు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.

ప్రాక్టీస్ చూసి అలసిపోయా:

ప్రాక్టీస్ చూసి అలసిపోయా:

'క్రూరమైన సాధన ఇది. నేను కేవలం ప్రాక్టీస్ చూసి అలసిపోయాను. సింధు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడం వెనక ఎలాంటి రహస్యం లేదు. కఠోర శ్రమతోనే ఛాంపియన్‌ అయింది. ఆమె కష్టాన్ని నేటి తరం క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలి' అని ఆనంద్ మహీంద్రా ట్వీట్‌ చేశారు. ఆనంద్ మహీంద్రా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న విషయం తెలిసిందే.

సింధు చరిత్ర:

సింధు చరిత్ర:

ఆదివారం జరిగిన ప్రపంచ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ (బీడబ్ల్యూఎఫ్‌) మహిళల సింగిల్స్‌ ఫైనల్లో పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ప్రపంచ ఐదో ర్యాంకర్‌ సింధు 21-7, 21-7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్‌)పై విజయం సాధించింది. సింధు కేవలం 38 నిమిషాల్లో ఒకుహారాను మట్టికరిపించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డుల్లోకి ఎక్కింది.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. మిథాలీకి చోటు దక్కేనా?

ఒలింపిక్స్‌లో పసిడి పతకమే లక్ష్యం:

ఒలింపిక్స్‌లో పసిడి పతకమే లక్ష్యం:

ప్రపంచ ఛాంపియన్ షిప్ టోర్నీ పూర్తి చేసుకుని సింధు మంగళవారం భారత్‌ చేరుకుంది. ఢిల్లీలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. భారత్‌కు రాగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజును సింధు కలిశారు. అనంతరం హైదరాబాద్‌ చేరుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌తో కల నెరవేరింది. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకమే లక్ష్యమని సింధు పేర్కొంది.

Story first published: Wednesday, August 28, 2019, 11:42 [IST]
Other articles published on Aug 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X