సెమీ ఫైనల్లో అదరగొట్టిన సింధు: కొరియన్ సిరీస్‌లో తొలిసారి ఫైనల్లోకి..

సియోల్: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగు తేజం సింధు అదరగొడుతోంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో సింధు 21-10, 17-21, 21-16 తేడాతో బింగ్‌జియావో(చైనా)పై విజయం సాధించి ఫైనల్లో అడుగపెట్టింది.

కొరియా ఓపెన్‌: సెమీస్‌కి సింధు, ఇంటిదారి పట్టిన సమీర్‌

13-6, 19-9 తేడాతో తొలి సెట్‌ను సునాయసంగానే గెలుచుకున్న సింధు.. ప్రత్యర్థి బింగ్ జియావో పుంజుకోవడంతో రెండో సెట్‌ను కోల్పోయింది. మూడో సెట్ హోరాహోరీ జరగ్గా.. సింధు మరోసారి సత్తా చాటింది.

PV Sindhu Reaches Korea Open Final After Thrilling Win

ఒత్తిడిని జయించి బింగ్ జియావోను చిత్తు చేయడం ద్వారా గేమ్‌ను గెలుచుకుంది. తద్వారా ఫైనల్లోకి అడుగుపెట్టింది. కొరియన్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో సింధు అడుగుపెట్టడం సింధుకు ఇదే తొలిసారి కావడం విశేషం.

Story first published: Saturday, September 16, 2017, 13:03 [IST]
Other articles published on Sep 16, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి