న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విరాట్ కోహ్లీ, సానియా మిర్జాకు సవాల్ విసిరిన పీవీ సింధు

PV Sindhu participated in Green India Challenge and Planted ‘Kadamba’ Sapling at Gopichand Academy

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్, వరల్డ్ చాంపియన్ పీవీ సింధు శనివారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా నగరంలోని పుల్లెల గోపీచంద్ ఇంటర్నేషన్ అకాడమీలో పీవీ సింధు మూడు కదంబ మొక్కలను నాటారు. హరితహారం చాలా గొప్ప కార్యక్రమమని, పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పీవీ సింధు మొక్కలు నాటిన ఫోటోలను తన ట్విట్టర్‌లో పంచుకుంది. "నన్ను నామినేట్ చేసినందుకు తెలంగాణ క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలు. ఈ ఛాలెంజ్‌ను అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను దానిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని భరోసా ఇస్తున్నాను" అని సిందు కామెంట్ పెట్టారు.

కోహ్లీ, మన్రో రికార్డు బద్దలు: ఆసీస్ తరుపున టీ20ల్లో వార్నర్‌ సరికొత్త రికార్డుకోహ్లీ, మన్రో రికార్డు బద్దలు: ఆసీస్ తరుపున టీ20ల్లో వార్నర్‌ సరికొత్త రికార్డు

"ఈ గ్రీన్ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని నేను అభినందిస్తున్నాను. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు మూడు మొక్కలు నాటడంతో పాటు ముగ్గురిని నామినేట్ చేయాలి. ఇంతటి గొప్ప కారణంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. నేను కోహ్లీ, అక్షయ్ కుమార్, సానియా మిర్జాలను నామినేట్ చేస్తున్నా" అని సింధు రెండో ట్వీట్‌లో పోస్టు చేశారు.

స్మరించుకుందాం: ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ తొలి డబుల్ సెంచరీకి నేటితో ఆరేళ్లు పూర్తిస్మరించుకుందాం: ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ తొలి డబుల్ సెంచరీకి నేటితో ఆరేళ్లు పూర్తి

Story first published: Saturday, November 2, 2019, 18:00 [IST]
Other articles published on Nov 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X