కొరియా ఓపెన్‌: సెమీస్‌కి సింధు, ఇంటిదారి పట్టిన సమీర్‌

Posted By:

హైదరాబాద్: కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తన జోరుని కొనసాగిస్తోంది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. టోర్నీలో ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో ఐదో సీడ్ సింధు 21-19, 21-16, 21-10 మిటాని (జపాన్) పై విజయం సాధించింది.

PV Sindhu continues stunning run, reaches semi-final of Korean Super Series

హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్‌లో సింధు విజయం సాధించగా రెండో సెట్‌ను కోల్పోయింది. తిరిగి మూడో సెట్‌లో విజృంభించి మితానిని చిత్తు చేసింది. 63 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో మిటానిపై సింధు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

అంతకుముందు పురుషుల సింగిల్స్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సమీర్‌ వర్మ 22-20, 10-21, 13-21తో టాప్‌ సీడ్‌ సాన్‌వాన్‌(దక్షిణ కొరియా) చేతిలో ఓటమి పాలయ్యాడు.


అంత‌కుముందు గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండోరౌండ్‌లో ఐదో సీడ్ సింధు 22-20, 21-17తో ప్రపంచ 16వ ర్యాంకర్ నిచెన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది. 42 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జిందాపోల్ గట్టిపోటీ ఇచ్చింది.

Story first published: Friday, September 15, 2017, 15:43 [IST]
Other articles published on Sep 15, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి