న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీబీఎల్ 2019 షురూ: తొలి మ్యాచ్‌ సింధు Vs మారిన్, ప్రైజ్‌మనీ తదితర వివరాలు

Premier Badmtinon League 2018: With foes like these who needs friends

హైదరాబాద్: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) నాలుగో సీజన్‌ శనివారం ముంబై వేదికగా తెరలేవనుంది. ఈసారి టోర్నీలో మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటున్నాయి. ఢిల్లీ డాషర్స్‌, అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌, అవధె వారియర్స్‌, బెంగళూరు రాప్టర్స్‌, ముంబై రాకెట్స్‌, హైదరాబాద్‌ హంటర్స్‌, చెన్నై స్మాషర్స్‌, నార్త్‌ ఈస్ట్రన్‌ వారియర్స్‌ పాటు పుణె 7 ఏసెస్‌ జట్టు ఈ సీజన్లో కొత్తగా వచ్చి చేరింది.

ఇయర్ ఎండ్ 2018: మొత్తం ఐదు, టెస్టుల్లో కోహ్లీ అరుదైన ఘనతఇయర్ ఎండ్ 2018: మొత్తం ఐదు, టెస్టుల్లో కోహ్లీ అరుదైన ఘనత

నార్త్‌ ఈస్ట్రన్‌ వారియర్స్‌కు సైనా నెహ్వాల్ కెప్టెన్‌గా ఉండగా బెంగళూరు రాప్టర్స్‌కు శ్రీకాంత్‌, ఢిల్లీ డాషర్స్‌కు హెచ్‌‌ఎస్‌ ప్రణయ్‌ కెప్టెన్లుగా ఉన్నారు. చెన్నై స్మాషర్స్‌కు సంగ్‌ జి హ్యున్‌ (కొరియా), అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్‌కు విక్టర్‌ అక్సెల్‌సెన్‌ (డెన్మార్క్‌), అవధె వారియర్‌కు సొన్‌ వాన్‌ హొ (కొరియా), ముంబై రాకెట్స్‌కు లీ యంగ్‌ డె (కొరియా) సారథ్యం వహిస్తున్నారు.

టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ వర్లిలోని నేషనల్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌సీఐ)లో పుణే సెవెన్‌ ఏసెస్, హైదరాబాద్‌ హంటర్స్‌ జట్ల మధ్య జరగనుంది. టోర్నీ ఫార్మాట్‌ ప్రకారం ఇరు జట్ల మధ్య పోరులో రెండు పురుషుల సింగిల్స్, ఒక మహిళల సింగిల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్, పురుషుల డబుల్స్‌ విభాగాల్లో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి.

ఒక్కో మ్యాచ్‌ మూడు గేమ్‌ల పాటు సాగుతుంది. ప్రతి గేమ్‌కు గరిష్టంగా 15 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. మొత్తం 23 రోజుల పాటు ఐదు వేదికల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో అహ్మదాబాద్, పుణే తొలిసారి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. బెంగళూరులో జనవరి 13న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగియనుంది.

తొలి మ్యాచ్‌లో సింధు Vs మారిన్

గతేడాది వరకు చెన్నైకు ఆడిన తెలుగు తేజం పీవీ సింధు ప్రస్తుతం హైదరాబాద్‌ హంటర్స్‌ కెప్టెన్‌గా బరిలో దిగుతోంది. ఇటీవలే వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ నెగ్గి చరిత్ర సృష్టించిన సింధు మంచి ఫామ్‌లో ఉంది. టోర్నీలో భాగంగా జరిగే తొలి మ్యాచ్‌లో పీవీ సింధు-కరోలినా మారిన్ తలపడుతున్నారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ "నాలుగో సీజన్‌లో హైదరాబాద్‌కు ఆడుతున్నాను. నా శక్తి మేర ఆడేందుకు ప్రయత్నిస్తా. ఇలాగే జట్టు సభ్యులు రాణిస్తారని ఆశిస్తున్నా" పేర్కొంది.

గచ్చిబౌలిలో 5 మ్యాచ్‌లు:

ఈ సీజన్లో హైదరాబాద్‌ గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈనెల 25న చెన్నై స్మాషర్స్‌తో హైదరాబాద్‌ హంటర్స్‌, 26న నార్త్‌ ఈస్ట్రన్‌తో దిల్లీ డాషర్స్‌, 27న ముంబై రాకెట్స్‌తో నార్త్‌ ఈస్ట్రన్‌, 28న అహ్మదాబాద్‌ స్మాషర్స్‌తో బెంగళూరు రాప్టర్స్‌, అవధె వారియర్స్‌తో హైదరాబాద్‌ హంటర్స్‌ తలపడతాయి.

గత విజేతలు

  • 2013 హైదరాబాద్‌
  • 2016 ఢిల్లీ డాషర్స్‌
  • 2017 చెన్నై స్మాషర్స్‌

నాలుగో సీజన్ హైలెట్స్:

1 - పుణె 7 ఏసెస్‌కు ఇదే తొలి పీబీఎల్‌ టోర్నీ.

రూ.6 కోట్లు - ఈసారి పీబీఎల్‌ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ విలువ. విజేతకు రూ.3 కోట్లు. రన్నరప్‌ జట్టుకు 1.5 కోట్లు బహుమతిగా దక్కుతాయి. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లకు చెరో రూ.75 లక్షలు లభిస్తాయి.

9 - ఈ టోర్నీలో బరిలో దిగుతున్న జట్లు

90 - ఈసారి పీబీఎల్‌లో ఆడుతున్న క్రీడాకారుల సంఖ్య

17 - లీగ్‌లో పదిహేడు దేశాల ఆటగాళ్లు లీగ్‌లో ప్రాతినిధ్యం వహించనున్నారు.

8 - బ్యాడ్మింటన్‌ ప్రపంచ టాప్‌-10 ర్యాంకుల్లోని 8 మంది ఈ లీగ్‌లో ఆడనున్నారు.

హైదరాబాద్‌ హంటర్స్‌ జట్టు

కెప్టెన్‌: పీవీ సింధు

పురుషుల సింగిల్స్‌: లీ హ్యున్‌ ఇ, చిట్టబోయిన రాహుల్‌ యాదవ్, మార్క్‌ కాల్జౌ

మహిళల సింగిల్స్‌: పీవీ సింధు, సాయి ఉత్తేజిత రావు

పురుషుల డబుల్స్‌: కిమ్‌ సా రాంగ్, అరుణ్‌ జార్జ్, బోదిన్‌ ఇస్సారా

మిక్స్‌డ్‌ డబుల్స్‌: ఇయొం హె వాన్, జక్కంపూడి మేఘన

Story first published: Saturday, December 22, 2018, 17:43 [IST]
Other articles published on Dec 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X