జ్వాల గుత్తాకు స్పెషల్ బర్త్ డే గిఫ్ట్.. ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగేసిన బాయ్‌ఫ్రెండ్!!

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్‌ స్టార్ జ్వాల గుత్తా ఈరోజు 37వ పడిలోకి అడుగుపెట్టారు. ఏస్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తాకు ఇది ప్రత్యేక పుట్టినరోజు అని చెప్పాలి. ఎందుకంటే ఆమె బాయ్‌ఫ్రెండ్, కన్నడ నటుడు విష్ణు విశాల్ స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చారు. పుట్టినరోజు నాడే జ్వాల గుత్తా కు విష్ణు విశాల్ ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగేశాడు. బ‌ర్త్‌డే వేడుకలను జరపడానికి చెన్నై నుంచి ఆయన పనికట్టుకుని హైద‌రాబాద్ వచ్చాడు. మొత్తానికి జ్వాల, విశాల్ ఎంగేజ్మెంట్ జరిగిపోయింది.

ఐపీఎల్‌ను వదలని మహమ్మారి.. ఢిల్లీ క్యాపిటల్స్‌లో కరోనా టెన్షన్‌!!

జ్వాల గుత్తాకు ఎంగేజ్మెంట్:

జ్వాల గుత్తాకు ఎంగేజ్మెంట్:

జ్వాల గుత్తాకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగిన విషయాన్ని విష్ణు విశాల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'పుట్టినరోజు శుభాకాంక్షలు జ్వాల గుత్తా. మన జీవితానికి ఇది కొత్త ప్రారంభం. ఇలానే పాజిటివ్‌గా ఉందాం. ఆర్యన్, మన కుటుంబాలు, స్నేహితులు మరియు చుట్టుపక్కల ప్రజల మంచి భవిష్యత్తు కోసం కృషి చేద్దాం. మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలి' అని విష్ణు విశాల్ ట్విట్టర్ ద్వారా కోరాడు. పోస్టులో జ్వాల ఎంగేజ్మెంట్ రింగ్‌ను చూపిస్తున్నారు. అర్ధరాత్రి రింగ్ ఏర్పాటు చేసిన బసంత్ జైన్ అనే వ్యక్తికి విశాల్ ధన్యవాదాలు తెలిపాడు.

విశాల్ బర్త్ డే సందర్భంగా:

విశాల్ బర్త్ డే సందర్భంగా:

జులై 17న విష్ణు విశాల్ బర్త్ డే సందర్భంగా ఆయనకు స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చారు జ్వాల గుత్తా. బ‌ర్త్‌డే వేడుకలను జరపడానికి హైద‌రాబాద్ నుంచి చెన్నైకు వెళ్లారు. విశాల్‌కు చెప్పకుండా అతడి‌ ఇంటి ముందు ప్ర‌త్య‌క్ష‌మై స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్ చేశారు. విశాల్ బ‌ర్త్‌డే వేడుక‌ను ద‌గ్గ‌రుండి నిర్వ‌హించారు. అయితే సాధారణంగా బ‌ర్త్‌డే రోజు ‌ప్రేమికులు ఒక‌రికొరు బ‌హుమ‌తులిచ్చుకుంటారు. అయితే కరోనా నేపథ్యంలో జ్వాల గుత్తా మాత్రం త‌నే పెద్ద గిఫ్ట్ అన్నారు అప్పుడు. కరోనా వైరస్ లాక్‌డౌన్ వ‌ల్ల ప్రేమికుడిని మిస్ అవుతున్నానంటూ జ్వాల విర‌హవేద‌న చెందిన సంగ‌తి తెలిసిందే.

మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నాం:

మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నాం:

గత ఏప్రిల్ నెలలో తమ బంధంపై జ్వాల గుత్తా స్పష్టత ఇచ్చారు. విష్ణు విశాల్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. 'మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నాం. ఇందులో దాచుకోవడానికి ఏమీ లేదు. మా పెళ్లి జరగబోతోంది. వివాహ తేదీ ఖరారైన తర్వాత, లేదా పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టినప్పుడు మేమే అధికారికంగా ప్రకటిస్తాం' అని జ్వాల చెప్పారు. గతంలో చెప్పినట్టుగానే విష్ణు విశాల్ తాము ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలిపాడు.

చేతన్ ఆనంద్‌తో పెళ్లి:

జ్వాల గుత్తా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సహచర ఆటగాడు చేతన్ ఆనంద్‌తో ప్రేమలో పడ్డారు. చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత వీళ్లిద్దరూ 2005లో వివాహం చేసుకున్నారు. ఆరేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2011లో విడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. మరోవైపు కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రజనీ నటరాజ్‌తో 2011లో విష్ణు విశాల్‌ పెళ్లి జరిగింది. కొన్ని కారణాల వల్ల 2018లో వీరు విడాకులు తీసుకున్నారు. వారికి ఆర్య‌న్‌ అనే నాలుగేళ్ల కుమారుడున్నాడు. విష్ణు తమిళంలో దాదాపు 14 సినిమాల్లో నటించాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, September 7, 2020, 13:41 [IST]
Other articles published on Sep 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X