న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దయచేసి అర్థం చేసుకోండి.. నాకు కొంచెం విశ్రాంతి కావాలి

I need time to rest and prepare for big events, says Saina

హైదరాబాద్: వరుసగా టోర్నీల్లో పాల్గొనేముందు విశ్రాంతి కావాలని కోరుకుంటోంది భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌. వయస్సుకు తగ్గట్లే విశ్రాంతి కావాలని చెప్పింది. ఇటీవలే ఇండోనేషియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సైనా ఈ నెల 6 నుంచి 11 వరకు జరిగే ఆసియా జట్టు ఛాంపియన్‌షిప్‌ నుంచి తప్పుకునేందుకు అనుమతి ఇవ్వాలని భారత బ్యాడ్మింటన్‌ సంఘానికి (బాయ్‌) లేఖ రాసింది.

ఒకవేళ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఆమె ఆడితే వరుసగా మూడు వారాల పాటు బ్యాడ్మింటన్‌ ఆడినట్లు అవుతుంది. ఇండోనేషియా ఓపెన్‌ అయిపోగానే ప్రస్తుతం జరుగుతున్న ఇండియా ఓపెన్‌లో ఆమె బరిలో దిగింది. మార్చిలో జరిగే ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రాక్టీస్‌ కోసం సమయం కావాలని ఆమె కోరుతోంది.

''ఇది శిక్షణ కోసం మాత్రమే కాదు. నా శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కోసం. వరుసగా టోర్నీలు ఆడడం చాలా కష్టం. బయట నుంచి చూసేవాళ్లకు బాగానే ఉంటుంది. నేను ఏదో ఆడాలని ఆడట్లేదు. టోర్నీలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవ్వాలనే ఆలోచనతో ఉన్నా. నేను ప్రతి టోర్నీలో ఉండాలి, ఆడాలి అని ప్రజలు అనుకుంటారు. కానీ ఓడిపోతే 'సైనా ఓడింది', 'సైనా ఫామ్‌లో లేదు'
ఆ మాటలు భరించాల్సింది నేనే ' అంటారని.'బాధపడింది.

'కొన్ని సార్లు అలాంటి మాటలు తట్టుకోలేక ఏడ్చేశా. ప్రస్తుత నా పరిస్థితిని అర్థం చేసుకోవడం పెద్ద కష్టేమేమీ కాదు. ఎందుకంటే నా వయసు ఇప్పుడు 20 కాదు. నన్ను నేను ఫిట్‌గా ఉంచుకోవాలి. సుదీర్ఘ కాలం పాటు బ్యాడ్మింటన్‌ ఆడాలి. మీరు మా క్యాలెండర్‌ చూశారా? ఎన్ని టోర్నీలు ఉన్నాయో. ఏ టోర్నీ ఆడాలో, ఆ తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలీదు'' అని సైనా తెలిపింది.

మేలో జరిగే ఉబర్‌ కప్‌ ఫైనల్స్‌కు అర్హత కోసం ఆసియా ఛాంపియన్‌షిప్‌ ఆడాల్సి ఉంటుంది. అయితే భారత్‌ గెలిచేందుకు మెరుగైన అవకాశాల కోసం బాయ్‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో సైనా ఆడాలని కోరుకుంటోంది. ''నాకు సమయం కావాలని మీరు అర్థం చేసుకోండి. నేను దేశం కోసం ఆడనని అనట్లేదు. గతంలో ఉబెర్‌ కప్‌ మ్యాచ్‌లు చాలా ఆడాను. అన్ని మ్యాచ్‌లు గెలిచా. పెద్ద టోర్నీల్లో విజయాల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా. కామన్‌వెల్త్‌, ఆసియా క్రీడలపైనే ప్రస్తుతం నా గురి'' అని సింధు చెప్పింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, February 1, 2018, 9:50 [IST]
Other articles published on Feb 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X