న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీబీఎల్: హ్యాట్సాఫ్.. హైదరాబాద్

Hyderabad Hunters win PBL after thrilling final win over Bengaluru Blasters

హైదరాబాద్: వరుస షెడ్యూళ్లతో బిజీ బిజీగా సాగిన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌కు ముగింపు వచ్చేసింది. ఒకొక్కరిని దాటుకుంటూ ఫైనల్‌కు చేరుకున్న హైదరాబాద్ హంటర్స్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌ను హైదరాబాద్ వేదికగా ముందే నిర్ణయించినట్లుగా అక్కడే జరిగింది.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో హంటర్స్‌ 4-3తో బెంగళూరు బ్లాస్టర్స్‌ను ఓడించింది. నిర్ణాయక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-జిబేదియా జోడీ 15-8, 15-12తో బ్లాస్టర్‌ జంట కిమ్‌ సా రంగ్‌-సిక్కిరెడ్డిని ఓడించి జట్టుకు టైటిల్‌ అందించింది.

అంతకుముందు జట్టు 2-3తో వెనుకబడిన దశలోమహిళల సింగిల్స్‌లో కెప్టెన్‌ కరోలినా మారిన్‌ 15-8, 15-14 తో క్రిస్టీ గిల్మోర్‌పై నెగ్గి జట్టును రేసులో నిలిపింది. తొలుత మొదటిదైన పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్‌ జంట మార్కిస్‌ కిడో- యి యాన్‌ సెయాంగ్‌ 9-15, 10-15తో మథియాస్‌ బోయె-కిమ్‌ సా రంగ్‌ ద్వయం చేతిలో ఓడింది.
అయితే, ట్రంప్‌గా ఎంచుకున్న పురుషుల తొలి సింగిల్స్‌లో లీ హ్యున్‌ 15-7, 15-13తో శుభాంకర్‌(బ్లాస్టర్స్‌)ను ఓడించి జట్టును 2-1తో ఆధిక్యంలో నిలిపాడు. కానీ, బెంగళూరు ట్రంప్‌గా ఎంచుకున్న పురుషుల రెండో సింగిల్స్‌లో వరల్డ్‌ చాంపియన్‌ విక్టర్‌ అక్సెల్సన్‌ 15-8, 15-10తో సాయి ప్రణీత్‌ను చిత్తుచేయడంతో, బెంగళూరు 3-2తో మళ్లీ ఆధిక్యం సాధించింది. చివరి రెండు మ్యాచ్లఓ్ల మారిన్‌, సాత్విక్‌ విజయాలతో ట్రోఫీ నెగ్గిన హంటర్స్‌ రూ. 3 కోట్ల ప్రైజ్‌మనీ అందుకుంది. మారిన్‌ ఉత్తమ ప్లేయర్‌గా నిలిచింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 16, 2018, 13:13 [IST]
Other articles published on Jan 16, 2018
Read in English: Hunters clinch PBL title
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X