తెలంగాణ ప్రభుత్వంపై గుత్తాజ్వాల సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై భారత బ్యాడ్మింటన్ డబుల్స్ మాజీ ప్లేయర్ గుత్తాజ్వాల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహారిస్తోన్న తీరును ఆమె తప్పుపట్టారు. అకాడమీని నెలకొల్పేందుకు భూమిని కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ దిశగా అడుగులు వేయలేదని విమర్శించారు.
గత ఏడాది జూలైలో క్రీడల మంత్రి పద్మారావుని కలిసిన గుత్తాజ్వాల రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై అప్పట్లో చర్చించింది. అథ్లెట్స్‌కి తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాల కింద.. ప్లాట్‌ని ఇచ్చిందని.. అయితే ఇప్పటికీ తనకు మాత్రం ఆ ప్రోత్సాహకం అందలేదని గుత్తాజ్వాల ఆవేదన వ్యక్తం చేసింది.
అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు గుత్తాజ్వాల దూరమై చాలా రోజులవుతుంది. దీంతో ఆమె బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఈ అకాడమీకి స్థలం కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో సానుకూలంగా స్పందించిన సర్కార్ అప్పట్లో అంగీకరించింది.
అయినప్పటికీ ఇంతవరకు అకాడమీకి భూమి కేటాయించకపోవడంపై ఆమె ట్విట్టర్ వేదికగా తన అసంతృప్తి వ్యక్తం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications