న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒకుహరను గెలిచి.. పతకం ఖాయం చేసుకున్న సింధు

Drop by drop, PV Sindhu rises

హైదరాబాద్: పి.వి.సింధు మళ్లీ మెరిసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్‌ చేరి పతకాన్ని ఖరారు చేసుకుంది. శుక్రవారం హోరాహోరీ పోరులో సింధు 21-17, 21-19తో ఒకుహరను మట్టికరిపించింది. ఐతే మిగతా భారత క్రీడాకారులు ఇంటిముఖం పట్టారు. సైనా నెహ్వాల్‌ 6-21, 11-21తో ఒలింపిక్‌ ఛాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో పరాజయం చవిచూసింది.

ఒకుహరను ఫిట్‌నెస్‌తో దెబ్బకొట్టిన సింధు:

ఒకుహరను ఫిట్‌నెస్‌తో దెబ్బకొట్టిన సింధు:

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ఫైనల్లో ఒకుహర చేతిలో ఓటమికి 15 రోజుల్లోనే లెక్క సరిచేసింది సింధు. ఆట పరంగా ఇద్దరూ సమానంగా ఉన్న నేపథ్యంలో ఒకుహరను సింధు ఫిట్‌నెస్‌తో దెబ్బకొట్టింది. ఎప్పట్లాగే దూకుడుగా కాకుండా తెలివిగా ఆడింది. ప్రత్యర్థిని వీలైనంత ఎక్కువగా కోర్టులో తిప్పుతూ అలసిపోయేలా చేసింది. దూకుడుకు మారుపేరైన ఒకుహర.. సింధు వ్యూహంలో చిక్కి మూల్యం చెల్లించుకుంది.

ర్యాలీ గేమ్‌ ఆడుతూ ప్రత్యర్థిని కోర్టు నలువైపులా తిప్పి:

ర్యాలీ గేమ్‌ ఆడుతూ ప్రత్యర్థిని కోర్టు నలువైపులా తిప్పి:

58 నిమిషాల పోరాటంలో ఒకుహర 4-1 ఆధిక్యంతో తొలి గేమ్‌ను ఆరంభించింది. ఐతే సింధు ర్యాలీ గేమ్‌ ఆడుతూ ప్రత్యర్థిని కోర్టు నలువైపులా తిప్పింది. చక్కని ప్లేస్‌మెంట్స్‌తో పాయింట్లు రాబట్టి 11-10తో ఆధిక్యంలోకి వెళ్ళింది. అక్కడ్నుంచి ఒకుహరపై సింధుదే పైచేయి. ఒత్తిడి లేకుండా.. ఓపికగా ఆడిన సింధు ప్రత్యర్థి తప్పులు చేసే వరకు వేచి చూసింది. ఎక్కువగా ర్యాలీ గేమ్‌ ఆడింది. బాగా అలసిపోయిన ఒకుహర షటిల్‌పై నియంత్రణ కోల్పోయింది.

ఒక్కో అడుగు ముందుకేస్తూ.. సమాన స్థాయికి:

ఒక్కో అడుగు ముందుకేస్తూ.. సమాన స్థాయికి:

21-17తో తొలి గేమ్‌ సింధు గెలిచినా.. రెండో గేమ్‌లోనూ ఒకుహర దూకుడుగానే ఆడింది. ఆరంభంలో వరుసగా పాయింట్లు రాబట్టిన ఒకుహర అలసటతో కోర్టులో చురుగ్గా కదల్లేకపోయింది. దీంతో 9-3 ఆధిక్యంలో ఉన్న ఒకుహర చూస్తుండగానే వెనుకబడింది. క్రాస్‌కోర్ట్‌ షాట్లతో సింధు చెలరేగింది. 11 పాయింట్ల వద్ద ఒకుహరను అందుకుంది. అక్కడ్నుంచి ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఒక్కో పాయింటు గెలుస్తూ మ్యాచ్‌లో ఉత్కంఠ రేపారు. 19-19 పాయింట్ల వరకు వచ్చేసరికి ఒకుహర పూర్తిగా అలసిపోయింది. ఆ సమయంలో సింధు మంచి ఫిట్‌నెస్‌తో కనిపించింది.

ఆఖర్లో.. అలసిపోయిన ఒకుహర:

ఆఖర్లో.. అలసిపోయిన ఒకుహర:

సింధు ఆడిన స్మాష్‌ను నెట్‌కు ఆడిన ఒకుహర.. తర్వాతి షాట్‌ను కోర్టు బయటికి కొట్టడంతో సింధు విజయనాదం చేసింది. 21-19తో రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ సింధు సొంతమైంది. ఒకుహరపై తన గెలుపోటముల రికార్డును 6-6తో సమం చేసింది. నివారం జరిగే సెమీఫైనల్లో జపాన్‌కే చెందిన రెండోసీడ్‌ అకానె యమగుచితో సింధు తలపడనుంది. యమగుచితో ముఖాముఖి రికార్డులో సింధు 6-4తో ముందంజలో ఉన్నా.. చివరిగా ఇద్దరి మధ్య ఈఏడాది జరిగిన ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌లో యమగుచి గెలిచింది. ఇక, సింధు సెమీ్‌సలో ఓడినా, కనీసం కాంస్య పతకం దక్కుతుంది. 23 ఏళ్ల సింధుకు ఇది నాలుగో ప్రపంచ పతకం. 2013, 2014లో కాంస్య పతకాలు, 2017లో రజత పతకం సాధించింది.

Story first published: Saturday, August 4, 2018, 10:44 [IST]
Other articles published on Aug 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X