న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

28 ఏళ్లుగా కంటిలోనే: విస్తుత పోయిన యువతి

By Nageshwara Rao
Doctors find womans contact lens in her left eyelid 28 years after losing it

హైదరాబాద్: 28 ఏళ్ల క్రితం బ్యాడ్మింటన్ ఆడుతుండగా పోగొట్టుకున్న వస్తువు ఒకటి కంటిలో దొరికింది. ఇంతకీ ఏంటా వస్తువు అనుకుంటున్నారా? కంటిలో వాడే లెన్స్. కొద్ది రోజులుగా కంటి సమస్యతో బాధపడుతున్న ఓ యువతి డాక్టర్లను సంప్రదించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఆ యువతి కంటికి ఎమ్ఆర్ఐ స్కాన్ చేసిన వైద్యలు రిపోర్టులు చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సుమారు 28 ఏళ్ల క్రితం తన లెన్స్‌ పోయిందనుకున్న యువతి ఆ లెన్స్‌ కంటిలోనే ఉండటం విశేషం. వివరాల్లోకి వెళితే... బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ (42) కొన్ని రోజులుగా కంటి సమస్యతో బాధపడుతోంది.

దీంతో ఆమె స్థానిక వైద్యులను సంప్రదించింది. ఆవిడకు ఎమ్ఆర్ఐ స్కాన్ చేసిన వైద్యులు 28 ఏళ్లుగా తన కంట్లో ఉన్న లెన్స్‌ను గుర్తించారు. ఇదే విషయాన్ని సదరు మహిళలకు చెప్పగా మొదట ఆశ్చర్యపోయినా, తర్వాత అసలు సంఘటన వారికి గుర్తు చేసింది.

14 ఏళ్ల వయసులో ఉండగా ఓ రోజు బ్యాడ్మింటన్ ఆడుతుండగా షటిల్‌ కాక్ యువతి కళ్లకు తగిలింది. వెంటనే కంటిని నలుముకున్న అనంతరం ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత కంటికి తగిలిన గాయాన్ని తీరిగ్గా చూసుకుంటుండగా లెన్స్ కనిపించకుండా పోయింది. దీంతో గ్రౌండ్‌లోనే తన లెన్స్ పోయిందని అనుకొని అంతటితో ఊరుకుంది.

అయితే, ఎమ్ఆర్ఐ స్కాన్ ఆ లెన్స్ తన కంట్లోనే ఉన్న విషయాన్ని ఇన్ని సంవత్సరాలకు తెలుసుకొని ఆమె విస్తుపోయింది.

Story first published: Friday, August 17, 2018, 18:13 [IST]
Other articles published on Aug 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X