న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెన్మార్క్ ఓపెన్‌లో అదరగొడుతోన్న సైనా.. శ్రీకాంత్‌లు

Denmark Open: Srikanth, Saina make semis

ఒడెన్సీ: భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌.. డెన్మార్క్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ ఫైనల్లో అతను భారత్‌కే చెందిన సమీర్‌ వర్మపై 22-20, 19-21, 23-21 తేడాతో విజయం సాధించాడు. తనకంటే ఆటలో, ర్యాంకులో మెరుగైన శ్రీకాంత్‌కు సమీర్‌ గట్టి పోటీ ఇచ్చాడు. విజయం కోసం తుది కంటా పోరాడాడు. అంతకుముందు ప్రిక్వార్టర్స్‌లో వీళ్లిద్దరూ అద్భుత విజయాలు సాధించారు.

ఐదోసారి తలపడగా..తొలిసారి లిన్‌ డాన్‌పై విజయం

ఐదోసారి తలపడగా..తొలిసారి లిన్‌ డాన్‌పై విజయం

శ్రీకాంత్‌ చైనా దిగ్గజ ఆటగాడు లిన్‌ డాన్‌పై విజయం సాధించడం విశేషం. 2014 చైనా ఓపెన్‌లో డాన్‌పై సంచలన విజయంతో ప్రకంపనలు రేపిన శ్రీకాంత్‌.. గురువారం అతడిపై రెండో విజయం నమోదు చేశాడు. వీరిద్దరూ ఐదోసారి తలపడగా..చివరిసారి 2016 రియో ఒలింపిక్స్‌ క్వార్టర్‌ఫైనల్లో శ్రీకాంత్‌పై డాన్‌ నెగ్గాడు. 2014 చైనా ఓపెన్‌లో తొలిసారి లిన్‌పై విజయం సాధించాడు.

 సైనా అదరగొట్టే ఆటతీరుతో అద్భుత విజయం

సైనా అదరగొట్టే ఆటతీరుతో అద్భుత విజయం

మరో ప్రిక్వార్టర్స్‌లో సమీర్‌ 23-21, 6-21, 22-20తో ఆసియా క్రీడల ఛాంపియన్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండొనేసియా)ను ఓడించాడు. హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ డెన్మార్క్ ఓపెన్‌లో అదరగొడుతోంది. జపాన్ సంచలన షట్లర్ అకానె యమగుచితో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ పోరులో సైనా అదరగొట్టే ఆటతీరుతో విజయంతో క్వార్టర్‌ఫైనల్ చేరింది.

సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప క్వార్టర్స్‌కు

సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప క్వార్టర్స్‌కు

మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌, డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో సైనా 17-21, 21-16, 21-12తో రెండో సీడ్‌ యమగూచి (జపాన్‌)పై విజయం సాధించింది. యమగూచితో ఎనిమిది మ్యాచ్‌ల్లో తలపడ్డ సైనాకు ఇది రెండో విజయం మాత్రమే. చివరగా 2014లో ఆమెను ఓడించింది.

జపాన్‌కే చెందిన ఒకుహరతో

జపాన్‌కే చెందిన ఒకుహరతో

క్వార్టర్స్‌లో సైనా.. ప్రపంచ మూడో నంబర్‌ క్రీడాకారిణి, జపాన్‌కే చెందిన ఒకుహరతో తలపడుతుంది. హోరాహోరీగా సాగిన మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో గొప్పగా పోరాడిన సిక్కి-అశ్విని 18-21, 22-20, 21-18తో ఏడో సీడ్‌ లీ హో-షిన్‌ చాన్‌ (దక్షిణ కొరియా) జోడీని ఓడించారు. స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు తొలి రౌండ్లోనే ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, October 20, 2018, 10:35 [IST]
Other articles published on Oct 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X