న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలేసియాను ఓడించామనే విషయమే (విజయమే) నమ్మశక్యం కావట్లేదు

Commonwealth Games 2018: PV Sindhu will compete in badminton singles event, says coach Pullela Gopichand

హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా జరిగిన బ్యాడ్మింటన్ టీమ్‌ ఈవెంట్లో మలేసియా జట్టును భారత్ ఓడించి స్వర్ణం గెలుచుకుంది. ఇలాంటి అత్యంత బలమైన జట్టును ఓడించి స్వర్ణం గెలవడం నమ్మశక్యం కావట్లేదని భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నాడు. ఈ సందర్భంగా తన భారత బ్యాడ్మింటన్ జట్టును తెగ పొగిడేస్తున్నాడు. మలేసియాను ఓడించడం రికార్డు నెలకొల్పినంత ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.

స్వర్ణం గెలవడం పట్ల అమితానందంగా

స్వర్ణం గెలవడం పట్ల అమితానందంగా

‘కామన్వెల్త్‌ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం గెలవడం చాలా చాలా ఆనందంగా అనిపిస్తోంది. అందులోనూ మలేసియా లాంటి బలమైన జట్టును ఓడించి విజేతలుగా నిలవడం గొప్పగా ఉంది. ఈ విజయంలో మిక్స్‌డ్‌ డబుల్స్‌ జోడీ అశ్విని పొన్నప్ప-సాత్విక్‌ సాయిరాజ్‌లది కీలక పాత్ర. వారి గురించి ఎంత పొగిడినా తక్కువే. వాళ్లు అద్భుత విజయంతో మంచి ఆరంభం ఇచ్చారు' అని వివరించాడు.

ఊహకే అందేది కాదు

ఊహకే అందేది కాదు

'శ్రీకాంత్‌, సైనా మిగిలిన పని చూసుకున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు టీమ్‌ ఈవెంట్లలో మలేసియాను ఓడించడం ఊహకే అందేది కాదు. భారత బ్యాడ్మింటన్‌ లోతు పెరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. లీ చాంగ్‌ వీపై ఒత్తిడి పెంచి శ్రీకాంత్‌ విజయం సాధించాడు' అని గోపీచంద్‌ అన్నాడు.

కిదాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ:

కిదాంబి శ్రీకాంత్ మాట్లాడుతూ:

‘లీ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో లేడన్న మాట వాస్తవమే. కానీ అతని లాంటి మేటి ఆటగాడిపై విజయం ఆషామాషీ కాదు. రక్షణాత్మకంగా ఆడుతూనే దాడి చేయాల్సి ఉంటుంది. అత్యుత్తమంగా ఆడటానికి ప్రయత్నించా. అయితే విజయం ఇంత సులభంగా లభిస్తుందని అనుకోలేదు'' అని కిదాంబి శ్రీకాంత్‌ అన్నాడు.

 సైనా మాట్లాడుతూ:

సైనా మాట్లాడుతూ:

‘‘కెరీర్‌లోనే గుర్తుంచుకోదగ్గ విజయమిది. ఒక దశలో నీరసపడ్డాను. మ్యాచ్‌పై దృష్టి కేంద్రీకరించలేకపోయాను. కానీ ఎలాగోలా తిరిగి పుంజుకున్నా. పాయింట్‌ గెలిచి భారత్‌కు స్వర్ణం అందించడం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన గెలుపు. ఎందుకంటే ఇది జట్టుగా సాధించిన విజయం'' అని సైనా చెప్పింది.

Story first published: Tuesday, April 10, 2018, 9:38 [IST]
Other articles published on Apr 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X