న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో శుభారంభం చేసిన సైనా, శ్రీకాంత్

Badminton World Championship 2018: Srikanth enters second round as Indians struggle

హైదరాబాద్: వరుస పరాజయాలు ఎదుర్కొంటోన్న కిదాంబి శ్రీకాంత్.. విజయ కాంక్షతో బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో అడుగుపెట్టి ఎట్టకేలకు శుభారంభాన్ని నమోదు చేసుకున్నాడు. మంగళవారం జరిగిన పోటీల్లో వియాత్నంకు చెందిన నాట్ న్యూయెన్‌ను 21-15, 21-16తేడాతో గెలుపొందాడు. సోమవారం జరిగిన పోటీల్లో మరో భారత క్రీడాకారుడు హెచ్‌ఎస్ ప్లేయర్ రెండో రౌండ్లోకి దూసుకుపోయాడు.

టోర్నీలో భాగంగా మహిళల సింగిల్స్‌లో సైనా, తర్వాతి రౌండ్లలోకి అడుగుపెట్టారు. తొలి రౌండ్లో బై లభించిన సైనా రెండో రౌండ్లో ఈ రోజు అలియె దెమిర్‌బగ్‌ (టర్కీ)తో తలపడింది. తొలి గేమ్‌లో మాత్రమే అలియో.. సైనాకు పోటీ ఇవ్వగలిగింది. రెండో గేమ్‌లో ప్రత్యర్థి చేతులెత్తేయంతో సులువుగా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సైనా 21-17, 21-8 తేడాతో విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.

ఇప్పటివరకూ తొలి రౌండ్లను ఇద్దరు ప్లేయర్లు దాటేయగా డబుల్స్‌లో మాత్రం ఫలితాలు సానుకూలంగా రాలేదు. భారత్‌కు చెందిన శ్లోక్ రామచంద్రన్, అర్జున్ ఎమ్మార్‌ల జోడి 14-21, 15-21స్కోరుతో మలేసియాకు చెందిన ఒంగ్ యూ సిన్, టియో ఏ యీల చేతిలో ఓటమికి గురైంది.

వీరితో పాటు డబుల్స్ జంట తరుణ్ కోనా, సౌరవ్ శర్మ 51 నిమిషాల పాటు పోరాడి 20-22, 21-18, 17-21తేడాతో హాంగ్‌కాంగ్ ప్లేయర్లు చిన్ చుంగ్, తంగ్ చున్ మన్‌ల చేతిలో చిత్తయ్యారు. ఇదే క్రమంలో ప్రణవ్ చోప్రా, సిక్కి రెడ్డిల జోడి కూడా వరల్డ్ ఛాంపియన్స్‌లో 16-21, 4-21తేడాతో ఇండోనేషియాకు చెందిన హఫీజ్ ఫైజల్, గ్లోరియా ఎమ్మాన్యుయేల్ విదజ చేతిలో ఓడిపోయారు.

ప్రపంచ బ్యాడ్మింటన్ షిప్‌లో భారత ఆటగాళ్ల ఫలితాలు:

పురుషుల సింగిల్స్: కిదాంబి శ్రీకాంత్ (నాట్ న్యూయెన్)పై (21-15, 21-16)తో

మహిళల సింగిల్స్: అలియె దెమిర్‌బగ్‌(టర్కీ)పై సైనా నెహ్వాల్ (21-17, 21-8) తేడాతో విజయం

పురుషుల డబుల్స్: తరుణ్ కోనా, సౌరవ్ శర్మ(20-22, 21-18, 17-21) ఓడిపోయారు.
* అర్జున్ ఎమ్మార్, శ్లోక్ రామచంద్రన్ (14-21, 15-21)తో ఓడిపోయారు.
*రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి వర్సెస్ మార్కస్ ఎల్లీస్, క్రిస్ లాంగ్ రిడ్జ్ (జరగాల్సి ఉంది)

మిక్స్‌డ్ డబుల్స్:
*ప్రణవ్ జెర్రీ చోప్రా, సిక్కీ రెడ్డి హఫీజ్ ఫైజల్ గ్లోరియా ఎమ్మాన్యుయేల్ విదజ (16-21, 4-21) తేడాతో ఓడిపోయారు.
* రాంకి రెడ్డి, అశ్విని పొన్నప్పలు మార్క్ లాంఫస్, ఇసబెల్ హెర్టిరిజ్ (10-21, 21-17, 21-18) తేడాతో ఓడిపోయారు.
* రోహన్ కపూర్, కుహో గార్గ్ వర్సెస్ క్రిస్ అడ్కోక్, గాబ్రియేల్ అడ్కోక్ (జరగాల్సి ఉంది)
* సౌరవ్ శర్మ, అనుష్క పరిఖ్ వర్సెస్ చాన్ పెంగ్ సూన్, గో లూయి యింగ్(జరగాల్సి ఉంది)

Story first published: Tuesday, July 31, 2018, 15:06 [IST]
Other articles published on Jul 31, 2018
Read in English: Srikanth in second round
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X