న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'వాళ్లలాగే నన్నూ.. మ్యాచ్ ఫిక్సింగ్ చేయమన్నారు'

Badminton star Lee was approached by match fixers

హైదరాబాద్: దొంగలు అన్ని చోట్లా ఉంటారన్నట్లు బ్యాడ్మింటన్‌లోనూ వారు బయటపడ్డారు. మలేషియా బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఫిక్సింగ్ చేసి దొరికిపోయారు. ఫిక్సింగ్‌ ఆరోపణలపై ఇద్దరు మలేసియా ప్లేయర్లను బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (బీడబ్ల్యూఎఫ్‌) ఈ నెల చివర్లో విచారించనుంది. అయితే ఫిక్సర్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరూ థామస్‌ కప్‌లో కూడా పాల్గొన్నారని సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న మలేషియా స్టార్ షట్లర్ లీ చాంగ్ వీ తీవ్ర మనస్తాపానికి గురైయ్యాడు. అతని ఆవేశాన్ని ఇలా.. మ్యాచ్‌ను ఫిక్స్‌ చేయాల్సిందిగా బుకీలు ఓసారి తనను సంప్రదించారని.. అయితే దానిని తిరస్కరించానని వెల్లడించాడు. ఫిక్సింగ్‌ ఆరోపణల విచారణను ఎదుర్కొంటున్న ఇద్దరు సహచర క్రీడాకారులను చూసి తలదించుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని లీ అన్నాడు. దేశ గౌరవమే తనకు ముఖ్యమని చెప్పాడు. దాని ముందు డబ్బు, హోదా ఇవేమీ పనికిరావంటూ అభిప్రాయపడ్డాడు.

వచ్చే నెలలో ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు లీ చాంగ్ వీ సిద్ధమయ్యాడు. తను మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మలేషియా తలదించుకునే పరిస్థితికి ఎప్పుడూ తీసుకురానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఆ విషయం దేశ పరువును దెబ్బ తీస్తుందని పేర్కొన్నాడు. ఎవరైతే ఇద్దరు ఫెడరేషన్ దగ్గర నేరస్థులుగా పేర్కొనబడ్డారో సిగ్గు పడాలంటూ తిట్టిపోశాడు. కానీ, వాళ్లు ఇప్పటికీ స్వదేశ జెండాను గుండెలపై ఎందుకు ధరిస్తున్నారంటూ ప్రశ్నించాడు.

'ఆయన మాట్లాడుతూ.. టాప్ పొజిషనలో ఉన్న నేను వీళ్లను చూసి సిగ్గుపడుతున్నాను. ఈ నిందలు, ఫిక్సింగ్‌లు త్వరలోనే సమసిపోతాయని భావిస్తున్నాను' అని పేర్కొన్నాడు. ఇంకా బ్యాడ్మింటన్ ఫెడరేషన్ నిందితులపై సరైన చర్యను తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Story first published: Thursday, February 22, 2018, 12:18 [IST]
Other articles published on Feb 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X