న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెమీస్‌లో సైనా, ప్రణయ్‌: సింధు, శ్రీకాంత్‌ ఓటమి

By Nageshwara Rao
Badminton: Saina, Sindhu, Srikanth, Prannoy qualify for World Championships

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ (ఏబీసీ)లో సైనా నెహ్వాల్, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. మరోవైపు ఈ టోర్నీలో ఫేవరెట్లుగా పోటీపడ్డ ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు, టాప్‌సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌ క్వార్టర్స్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.

శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో సైనా 21-15, 21-13తో లీ జాంగ్‌ మి (కొరియా)పై గెలుపొందగా... సింధు 19-21, 10-21తో సుంగ్‌ జీ హున్‌ (కొరియా) చేతిలో ఓడిపోయింది. ఆరంభంలో కాస్త వెనుకబడ్డా, ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న సైనా నలభై మూడు నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది.

సెమీస్‌కు చేరుకోవడం సైనాకు ఇది మూడోసారి

సెమీస్‌కు చేరుకోవడం సైనాకు ఇది మూడోసారి

ఆసియా చాంపియన్‌షిప్‌లో సైనా సెమీస్‌కు చేరుకోవడం ఇది మూడోసారి. 2010, 2016లలో ఆమె సెమీఫైనల్లో నిష్క్రమించి కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. ఇక, మరోవైపు పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రణయ్‌ 18-21, 23-21, 21-12తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ సన్‌ వాన్‌ హో (కొరియా)పై సంచలన విజయం సాధించాడు.

 తొలిగేమ్‌ను కోల్పోయిన ప్రణయ్

తొలిగేమ్‌ను కోల్పోయిన ప్రణయ్

గంటా పన్నెండు నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో తొలిగేమ్‌ను కోల్పోయి వెనకబడ్డ ప్రణయ్‌.. రెండోగేమ్‌లో అద్భుతంగా పోరాడాడు. దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు సాగిన రెండోగేమ్‌లో సన్‌ వాన్‌కు దీటుగా ప్రతిపాయింట్‌ కోసం చెమటోడ్చిన ప్రణయ్‌.. ఆఖర్లో 23-21తో ఆ గేమ్‌ను నెగ్గాడు. ఇక తనదైన ఆటతీరుతో అప్పటికే ప్రత్యర్థిని బాగా అలసిపోయేలా చేసిన ప్రణయ్‌ నిర్ణాయక మూడోగేమ్‌లో 21-12తో ఆ గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ నెగ్గాడు.

తొలి ప్లేయర్‌గా ప్రణయ్‌ గుర్తింపు

తొలి ప్లేయర్‌గా ప్రణయ్‌ గుర్తింపు

తద్వారా 2007లో అనూప్‌ శ్రీధర్‌ తర్వాత ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ తరఫున పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి ప్లేయర్‌గా ప్రణయ్‌ గుర్తింపు పొందాడు. శనివారం జరిగే సెమీస్‌లో ప్రణయ్‌ మూడో సీడ్‌ చెన్‌ లాంగ్‌తో తలపడుతుండగా.. సైనా టాప్‌సీడ్‌ తైజు యింగ్‌ (తైపీ)తో తలపడనుంది.

 లీ చోంగ్‌ వీ చేతిలో ఓడిపోయిన కిదాంబి శ్రీకాంత్

లీ చోంగ్‌ వీ చేతిలో ఓడిపోయిన కిదాంబి శ్రీకాంత్

పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో టాప్‌సీడ్‌ శ్రీకాంత్‌ 12-21, 15-21తో మలేసియా దిగ్గజ ఆటగాడు లీ చోంగ్‌ వీ చేతిలో ఓటమిపాలయ్యాడు. రెండు గేమ్‌ల్లోనూ అతడు నిరాశపరిచాడు. లీ చేతిలో శ్రీకాంత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. కామన్వెల్త్‌ క్రీడల వ్యక్తిగత విభాగం ఫైనల్లోనూ శ్రీకాంత్‌ ఓడిన సంగతి తెలిసిందే.

 పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌, సాయి ప్రణీత్‌

పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌, సాయి ప్రణీత్‌

ఇదిలా ఉంటే ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు భారత అగ్రశ్రేణి షట్లర్లు సింధు, సైనా, శ్రీకాంత్‌ అర్హత సాధించారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ జులై 30 నుంచి చైనాలో జరగనుంది. గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు రజతం, సైనా కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్‌, సాయి ప్రణీత్‌ కూడా పోటీపడనున్నారు.

ఏప్రిల్‌ 26న ర్యాంకులు ఆధారంగా జోడీల అర్హత

ఏప్రిల్‌ 26న ర్యాంకులు ఆధారంగా జోడీల అర్హత

పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌- చిరాగ్‌, సుమిత్‌ రెడ్డి- మను అత్రి జోడీలు బరిలో దిగనున్నాయి. మహిళల డబుల్స్‌లో అశ్విని- సిక్కిరెడ్డి, పూర్విశ-మేఘన.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అశ్విని- సాత్విక్‌, సిక్కిరెడ్డి- ప్రణవ్‌ జంటలు ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నాయి. ఏప్రిల్‌ 26న ర్యాంకులు ఆధారంగా ఆటగాళ్లు లేదా జోడీల అర్హత నిర్ణయిస్తారు. రెండో దశలో ఎవరు ఎంపికవుతారన్నది మే 17న ప్రకటిస్తారు.

Story first published: Saturday, April 28, 2018, 11:31 [IST]
Other articles published on Apr 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X