న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెమీస్‌కు చేరిన హైదరాబాద్ హంటర్స్

As it happened: PBL 2018-19, ties 21 and 22

హైదరాబాద్: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 4-3తో అహ్మదాబాద్‌ స్మాష్‌మాస్టర్స్‌పై పైచేయి సాధించింది. దీంతో 21 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. హంటర్స్‌ ట్రంప్‌గా ఎంచుకున్న మహిళల సింగిల్స్‌లో సింధు 15-14, 12-15, 15-14తో క్రిస్టీ గిల్మోర్‌పై నెగ్గి 3-3తో స్కోరు సమం చేసింది. ఆఖరి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో కిమ్‌ స రంగ్‌-ఇసారా జోడీ 15-10, 11-15, 15-14తో రెజినాల్డ్‌-సాత్విక్‌పై నెగ్గి హంటర్స్‌ను గెలిపించింది.

తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఇసారా-ఎమ్‌ ఒన్‌ జోడీ 15-14, 15-9తో సిక్కిరెడ్డి-సాత్విక్‌ ద్వయంపై నెగ్గి హంటర్స్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపింది. పురుషుల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌ అహ్మదాబాద్‌కు ట్రంప్‌ మ్యాచ్‌ కాగా... ఇందులో డారెన్‌ ల్యూ 15-13, 15-9తో రాహుల్‌ యాదవ్‌ (హైదరాబాద్‌)పై గెలుపొందాడు. రెండో సింగిల్స్‌లో విక్టర్‌ అక్సెల్‌సన్‌ 15-11, 13-15, 15-8తో మార్క్‌ కాల్జౌ (హైదరాబాద్‌)పై నెగ్గడంతో అహ్మదాబాద్‌ ఆధిక్యం 3-1కు చేరింది.

కరోలినా మారిన్‌, లక్ష్య సేన్‌ సత్తా చాటడంతో పుణె సెవెన్‌ ఏసెస్‌ 5-0తో ఢిల్లీ డాషర్స్‌ను ఓడించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకున్న ఏసెస్‌.. సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మహిళల సింగిల్స్‌లో మారిన్‌ 15-5, 15-6తో ఇవగీనియా కోసెట్‌కయాను మట్టికరిపించింది. లక్ష్యసేన్‌ 15-12, 15-11తో తన సోదరుడు చిరాగ్‌ సేన్‌పై నెగ్గాడు. ఢిల్లీ ట్రంప్‌ గా ఎంచుకున్న పురుషుల డబుల్స్‌లో మాథియాస్‌ బో-చిరాగ్‌ షెట్టి జోడీ 9-15, 15-10, 15-13తో మనోపోంగ్‌ జోంగ్‌జిట్‌-చియా బియావోపై నెగ్గారు.

అంతకుముందు ఏసెస్‌ ట్రంప్‌గా ఎంచుకున్న మిక్స్‌డ్‌లో ఇవనోవ్‌-జేర్స్‌ఫెల్డ్‌ జోడీ 15-9, 14-15, 15-8తో జోంగ్‌జిట్‌-కోసెట్‌కయా జంటపై నెగ్గింది. చివరగా జరిగిన పురుషుల సింగిల్స్‌లో సుగియార్తో 15-7, 15-14తో లెవర్డెజ్‌పై నెగ్గి ఢిల్లీకి ఒక పాయింట్‌ అందించాడు. కానీ ట్రంప్‌ మ్యాచ్‌ ఓడిన కారణంగా ఢిల్లీకి ఒక్క పాయింట్‌ కూడా దక్కలేదు. మరోవైపు ఢిల్లీ డాషర్స్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఐదో మ్యాచ్‌లోనూ ఢిల్లీ 0-6తో పుణే సెవెన్‌ ఏసెస్‌ చేతిలో చిత్తుగా ఓడింది. సోమవారం మ్యాచ్‌లో అవధ్‌ వారియర్స్‌తో చెన్నై స్మాషర్స్‌ తలపడుతుంది.

Story first published: Monday, January 7, 2019, 8:48 [IST]
Other articles published on Jan 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X