న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనోళ్లకు రాలేదు.. వాళ్లు మాత్రం వదల్లేదు

All England Championship: Shi Yuqi stuns Lin Dan to lift title

హైదరాబాద్: ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పురుషుల విభాగంలో షి యుకి (చైనా), మహిళల్లో తై జు యింగ్‌ (కొరియా) టైటిళ్లు కైవసం చేసుకున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ మహిళల నంబర్‌వన్‌ తై జు యింగ్‌ ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లాండ్ ఓపెన్‌లో తనకు తిరుగులేదని చాటుకుంది. ఈ చైనీస్‌ తైపీ షట్లర్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో సింగిల్స్‌ టైటిల్‌ను నిలబెట్టుకుంది.

సింధూని గెలిచిన యమగూచి:
సెమీస్‌లో భారత స్టార్‌ పీవీ సింధుపై అద్భుత విజయం సాధించిన జపాన్‌కు చెందిన ప్రపంచ రెం డో ర్యాంకర్‌ అకానె యమగుచి ఫైనల్లో టాప్‌సీడ్‌ తై జు ధాటికి నిలవలేకపోయింది. నలభైఐదు నిమిషాలపాటు సాగిన ఏకపక్ష పోరులో తై జు 22-20, 21-13తో యమగుచిని ఓడించింది. మహిళల తుది సమరంలో తై జు యింగ్‌ 22-20, 21-13తో అకానె యమగూచి (జపాన్‌)పై గెలిచింది.

పురుషుల సింగిల్స్‌లో:
పురుషుల సింగిల్స్‌లో ఏడోసారి ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ నెగ్గాలనుకున్న చైనా స్టార్‌ లిన్‌ డాన్‌ ఆశలు ఫలించలేదు. ఫైనల్లో చైనాకే చెందిన షి యుకి 21-19, 16-21, 21-9తో డాన్‌ను చిత్తుచేసి విజేతగా నిలిచాడు. ఫైనల్లో షి యుకి 21-19, 16-21, 21-9తో లిన్‌డాన్‌ (చైనా)ను ఓడించాడు.

నూటికి నూరు శాతం కష్టపడినా:
ఆల్‌ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ సెమీస్‌లో వందశాతం సత్తా చాటినా ఫలితం వ్యతిరేకంగా వచ్చిందని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వెల్లడించింది. రాబోయే రోజుల్లో మరింత బలంగా తిరిగొస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ రోజు నాది కాదు. నేను వంద శాతం కష్టపడ్డా. గెలుపోటముల్లో ఎత్తుపల్లాలు అనేది చాలా సహజం. సుదీర్ఘమైన ర్యాలీలు ఆడాం. అంతకుమించి యమగుచి బాగా పోరాడింది. మూడు గేమ్‌లు ఆడటమంటే మాటలు కాదు. రెండు మూడు పాయింట్లే మ్యాచ్ చివర్లో చాలా పెద్ద తేడాను తీసుకొస్తాయి. ఎవరి గేమ్‌లోనైనా ఇది జరుగుతుంది. ఈ టోర్నీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. ఓడినా గెలిచినా ఇది నాకు పెద్ద గుణపాఠం. దీని నుంచి మరింత నేర్చుకుని బలంగా తయారవుతా అని సింధు పేర్కొంది.

Story first published: Monday, March 19, 2018, 16:19 [IST]
Other articles published on Mar 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X