కొత్త ఏడాదిలో ఆటకు దూరమవుతున్న స్టార్లు.. ఆస్ట్రేలియా స్టార్ కూడా దూరం!

కొన్ని రోజుల క్రితం వింబుల్డన్‌లో అద్భుతంగా పోరాడి ఫైనల్ చేరిన ఆస్ట్రేలియన్ టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్‌ కెరీర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కొత్త ఏడాదిలో మొదటి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి అతను తప్పుకోవాల్సి వచ్చింది. కొన్నిరోజులుగా గిలక నొప్పితో బాధ పడుతూ ఉన్నాడీ ఎగ్రెసివ్ ప్లేయర్. కానీ దాని కన్నా ముందు మోకాలి వద్ద ఇబ్బందిగా ఉండటంతో అతను ఈ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇంతకుముందే వరల్డ్ నెంబర్ వన్ అల్కారెజ్, నావోమీ ఓసాకా కూడా ఈ టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచే అవకాశం ఉన్న ఆటగాళ్లలో కిర్గియోస్ ఒకడని చాలా మంది భావించారు. మనసులో ఉన్నది మొహమాటం లేకుండా చెప్పేస్తూ, తనకు నచ్చినట్లు చేస్తూ అందరి నోళ్లలో నిలిచిన కిర్గియోస్.. అద్భుతమైన ఆటగాడు కూడా. గతేడాది సూపర్ ఫామ్‌ కనబరిచిన అతను వింబుల్డన్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో అద్భుతంగా రాణించాడు. ప్రత్యర్థులకు చిత్తు చేస్తూ ఫైనల్ చేరాడు. అయితే చివరకు సెర్బియన్ లెజెండ్ నొవాక్ జకోవిక్ చేతిలో పరాజయం పాలయ్యాడు. కిర్గియోస్ వంటి ఆటగాళ్లు టెన్నిస్ భవిష్యత్తు అని జకోవిక్ కూడా కొనియాడిన సంగతి తెలిసిందే.

అలాంటి అతను కొత్త ఏడాదిలో తొలి గ్రాండ్‌స్లామ్ నుంచి తప్పుకోవాల్సి రావడం గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. తను చాలా బాధ పడుతున్నట్లు చెప్పాడు. 'నేను ఇక్కడ ఎన్నో మంచి టోర్నమెంట్లు ఆడా. గతేడాది డబుల్స్ విభాగంలో టైటిల్ కూడా సాధించా. ఇక్కడి నుంచే నా కలల ఆట మొదలవుతుందని అనుకున్నా' అన్నాడు. తన జీవితంలో ఎంతో ముఖ్యమైన టోర్నీల్లో ఇదొకటని చెప్పిన అతను.. తను కూడా టైటిల్ గెలిచే అవకాశం ఉందని భావించిన వాళ్లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇటీవల తను చాలా అలసిపోయానని, అదే తనపై తీవ్రమైన ప్రభావం చూపించిందని చెప్పాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకోవాల్సి రావడంతో చాలా భావోద్వేగానికి లోనయ్యానని చెప్పిన కిర్గియోస్.. కానీ తన చేతుల్లో ఏముండదని, ఈ ఆటలో గాయాలు కూడా ఒక భాగమని చెప్పాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, January 16, 2023, 14:56 [IST]
Other articles published on Jan 16, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X