న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రో కబడ్డీ బ్రాండ్ అంబాసిడర్: కూతకెళ్లి తొడగొట్టిన ధోని

Pro Kabaddi League 2018: Dhoni Participates In Kabaddi Promo Shooting
MS Dhoni in pro kabaddi league promotion at Mumbai

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనకు లభించిన ఖాళీ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తనకు దొరికిన ఖాళీ సమయాన్ని మరో రకంగా వినియోగించుకుంటున్నాడు. దీంతో ధోని ఇప్పుడు కబడ్డీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

ప్రో కబడ్డీ లీగ్ ప్రోమో షూటింగ్‌లో పాల్గొన్న ధోని

ప్రో కబడ్డీ లీగ్ ప్రోమో షూటింగ్‌లో పాల్గొన్న ధోని

తాజాగా ప్రో కబడ్డీ లీగ్ ప్రోమో షూటింగ్‌లో ధోని పాల్గొన్నాడు. అంతేకాదు కబడ్డీ సైతం ఆడాడు. ప్రొఫెషనల్ కబడ్డీ ఆటగాళ్లని తలపిస్తూ ప్రత్యర్థి కోర్టులోకి కూతకెళ్లిన ధోని ఒకరిని ఔట్ చేసి తొడ కూడా గొట్టాడు. ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఇప్పటికే ఎంతో విజయవంతమైంది.

ప్రో కబడ్డీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని

ఈ ఏడాది జరుగుతున్న ఆరో సీజన్‌కు ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్నాడు. ధోని ఎండార్స్‌మెంట్లను పర్యవేక్షించే చేసే రితి స్పోర్ట్స్ ప్రొ కబడ్డీ లీగ్ షూట్‌లో అతడు పాల్గొన్న ఫొటోను ట్వీట్ చేసింది. కాగా, భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్ 21 నుంచి సుదీర్ఘ సిరిస్ ప్రారంభం కానుంది.

టీ20ల నుంచి ధోనిని తప్పించిన సెలక్టర్లు

టీ20ల నుంచి ధోనిని తప్పించిన సెలక్టర్లు

ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. అయితే, ధోని మాత్రం వచ్చే ఏడాది వరకూ మరో అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం లేకపోయింది. జనవరి 12 నుంచి జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో మాత్రమే ధోని ఆడనున్నాడు.

వన్డేల్లో మాత్రమే జెర్సీని ధరించనున్న ధోని

వన్డేల్లో మాత్రమే జెర్సీని ధరించనున్న ధోని

ఈ వన్డే సిరీస్‌తో ధోని మళ్లీ భారత జెర్సీని ధరించనున్నాడు. 2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీని.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి సెలక్టర్లు ఎంపిక చేయని విషయం తెలిసిందే. ఈ మూడు టీ20ల సిరిస్‌లో ధోని స్థానంలో సెలక్టర్లు రిషబ్ పంత్‌కు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, November 14, 2018, 13:43 [IST]
Other articles published on Nov 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X