న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కామన్‌వెల్త్ క్రీడలకు సిద్ధమైన హాకీ జట్టు, కెప్టెన్‌గా రాంపాల్

Commonwealth Games, women's hockey: Rani leads, experienced hands Deepika, Poonam return for India

హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా ఏప్రిల్‌లో జరగబోయే కామన్‌వెల్త్ క్రీడలకు భారత హాకీ జట్టు సిద్ధమైంది. భారత జాతీయ క్రీడ హాకీ మహిళా జట్టు కెప్టెన్‌గా రాణి రాంపాల్‌కు అవకాశం దక్కింది. 18 మందితోకూడిన జట్టును రాణీ నడిపించనున్నదని, గోల్‌కీపర్ సవిత వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తుందని హాకీ ఇండియా బుధవారం నాడు ప్రకటించింది.

ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా పోటీలో భారత హాకీ జట్టుతో పాటు మలేసియా, వేల్స్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు పూల్ ఏలో ఉన్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 5న వేల్స్ జట్టుతో ఆడుతుంది. తాజాగా దక్షిణ కొరియాతో ముగిసిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆ సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న గోల్ కీపర్ సవిత జట్టులోకి పునరాగమనం చేయడం కలిసొచ్చే అంశం. ఆమెతో పాటు డిఫెన్స్ విభాగంలో సీనియర్లు దీపిక, సునిత లక్రా, దీప్ గ్రేస్, గుర్జిత్ కౌర్, సుశీల ఉన్నారు.

భారత మహిళా హాకీ జట్టు 2002 కామన్‌వెల్త్‌లో స్వర్ణ పతకం, 2006లో రజతం సాధించింది. అయితే 2010, 2014లో ఐదో స్థానంతోనే సరిపెట్టుకున్నది. ఈసారి స్వర్ణాన్ని సాధించి, 2002 చరిత్రను పునరావృతం చేస్తామని కెప్టెన్ రాణీ ఆశాభావం వ్యక్తం చేసింది.

కామన్ వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత మహిళా హాకీ జట్టు ఇదే:

Goalkeepers: Savita Punia (VC), Rajani Etimarpu

Defenders: Deepika, Sunita Lakra, Deep Grace Ekka, Gurjit Kaur, Sushila Chanu Pukhrambam

Midfielders: Monika, Namita Toppo, Nikki Pradhan, Neha Goyal, Lilima Minz

Forwards: Rani Rampal (C), Vandana Katariya, Lalremsiami, Navjot Kaur, Navneet Kaur, Poonam Rani

Story first published: Thursday, March 15, 2018, 9:41 [IST]
Other articles published on Mar 15, 2018
Read in English: CWG: Rani to lead India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X