న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చరిత్ర సృష్టించండి: మ్యాచ్ విరామంలో ఆటగాళ్లతో హాకీ కోచ్

By Nageshwara Rao
Asian Games 2018: India Betters 86-year Old Record to Hammer Hong Kong 26-0
Asian Games 2018: At half-time, coach Harendra told players, create legacy

హైదరాబాద్: "మ్యాచ్‌లో విజయంతో పాటు చరిత్ర సృష్టించండి" అని విరామంలో జట్టులోని ఆటగాళ్లకు కోచ్ చెప్పాడు. కోచ్ చెప్పినట్లే మ్యాచ్‌లో విజయం సాధించడంతో పాటు 86 ఏళ్ల రికార్డుని కూడా బద్దలు కొట్టారు. ఆసియా గేమ్స్‌లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన హాకీ మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు చారిత్రాత్మాక విజయాన్ని నమోదు చేసింది.

ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత పురుషల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఆతిథ్య ఇండోనేషియాను 17-0తో చిత్తు చేసిన భారత్‌.. బుధవారం హాంకాంగ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 26-0 గోల్స్ తేడాతో విజయం సాధించి, భారత హాకీ చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది.

ఇంత పెద్ద విజయాన్ని ఎన్నడూ సాధించలేదు

86 ఏళ్ల భారత హాకీ చరిత్రలోనే ఇంత పెద్ద విజయాన్ని ఎన్నడూ సాధించలేదు. హాంకాంగ్‌తో మ్యాచ్‌ అర్ధభాగం పూర్తయింది. అప్పటికే భారత్‌ 14-0తో ఆధిక్యంలో ఉంది. విరామానికి వచ్చిన ఆటగాళ్లతో కోచ్‌ హరేంద్ర సింగ్‌ మాట్లాడుతూ "ఇలాగే దూకుడుగా ఆడండి. చరిత్ర సృష్టించండి" అని అన్నారట. కోచ్ మాటలను విన్న ఆటగాళ్లు తిరిగి మైదానంలోకి వచ్చాక మరింత దూకుడుగా ఆడారు.

ఏకంగా 26 గోల్స్ సాధించి సరికొత్త చరిత్ర

దీంతో ప్రత్యర్ధి హాంకాంగ్‌కు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా ఏకంగా 26 గోల్స్ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. మ్యాచ్ అనంతరం కోచ్ హరేంద్ర సింగ్ మాట్లాడుతూ "ఈ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించడం సాధ్యమని భావించా. ఆటగాళ్లకు అదే చెప్పా. వెళ్లండి, మీ పేర్లతో చరిత్ర సృష్టించండి అని అన్నాను" అని తెలిపాడు.

వారు నా మాటలను నిజం చేశారు

వారు నా మాటలను నిజం చేశారు

"వారు నా మాటలను నిజం చేశారు. చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరైనా భారత హాకీ గురించి మాట్లాడుకుంటే తప్పకుండా ఈ విజయాన్ని ప్రస్తావిస్తారు. నేను రికార్డుల గురించి పట్టించుకోను. కానీ, ఆటగాళ్లకు మాత్రం ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. కోచ్‌ కంటే జట్టు ముఖ్యం. భారత హాకీ చరిత్రలో ఈ 18 మంది ఆటగాళ్ల పేర్లు ఉంటాయి." అని హరేంద్ర చెప్పాడు.

1932 తర్వాత భారీ ఆధిక్యంతో గెలవడం ఇదే తొలిసారి

1932 తర్వాత భారీ ఆధిక్యంతో గెలవడం ఇదే తొలిసారి

1932 తర్వాత భారత్‌ ఇంత భారీ ఆధిక్యంతో గెలవడం ఇదే తొలిసారి. 1932లో లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్‌ 24-1 తేడాతో అమెరికాపై విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ వ్యత్యాసంతో గెలవడం. భారత్‌ తరఫున 14 మంది ఆటగాళ్లు గోల్స్‌ నమోదు చేశారు. వీరిలో అక్షదీప్‌, రూపిందర్‌, లలిత్‌ తలో మూడు గోల్స్‌ సాధించగా హర్మన్‌ప్రీత్‌ ఏకంగా నాలుగు గోల్స్‌ సాధించాడు. 1994లో న్యూజిలాండ్ 36-1తో సమోవాపై గెలవడమే అంతర్జాతీయ పురుషుల హకీలో రికార్డు.

Story first published: Thursday, August 23, 2018, 14:33 [IST]
Other articles published on Aug 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X