బార్సిలోనాకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వబోం: తేల్చేసిన రియల్ మాడ్రిడ్ మేనేజర్

Posted By:
Zinedine Zidane rules out Real Madrid guard of honour for Barcelona

మాడ్రిడ్: లా లీగా చాంపియన్లుగా నిలువనున్న బార్సిలోనా టీమ్‌కు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వబోమని రియల్ మాడ్రిడ్ కోచ్ జినెడిన్ జిడానె తేల్చి చెప్పాడు. కాటలాన్స్ చాంపియన్లుగా నిలిస్తే లా లీగ లీడర్స్‌గా గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వరాదని నిర్ణయించామని గత డిసెంబర్ 23వ తేదీన జరిగిన లా లీగ సమావేశం లో నిర్ణయించామన్నాడు. అంతకుముందు కొద్ది రోజుల క్రితమే ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ టైటిల్‌ను రియల్ మాడ్రిడ్ కైవసం చేసుకున్నది. బార్సిలోనా 2008 మేలో తొలిసారి చాంపియన్స్‌గా నిలువనున్న 'రియల్ మాడ్రిడ్' జట్టుకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం ఫేమస్‌గా మారింది.

'నన్ను ప్రశ్నించే వారికి నా జవాబు కూడా స్పష్టంగా ఉంది. నా నిర్ణయమే ఫైనల్. గార్డ్ ఆఫ్ ఆనర్ కాన్సెప్ట్ నాకు అసలు అర్థం కాలేదు. మేం ఆ పని చేయబోం. బార్సిలోనా సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది' అని జినెడిన్ జిడానే పేర్కొన్నాడు.

బార్సిలోనా ఇన్సిట్యూషనల్ రిలేషన్స్ హెడ్ గౌల్లెర్మో ఆమోర్ గత డిసెంబర్ నెలలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ 'గార్డ్ ఆఫ్ ఆనర్' అంశాన్ని రిపీట్ చేయబోమని చెప్పాడు. ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ టోర్నీకి బార్సిలోనా జట్టు దూరంగా ఉన్నది.

ఇంకా ఏడు గేమ్స్ మిగిలి ఉండగానే లా లీగ టోర్నమెంట్‌లో బార్సిలోనా తొమ్మిది పాయింట్ల ఆధిక్యంలో ఉన్నది. రెండో స్థానంలో అట్లెంటికో మాడ్రిడ్ నిలిస్తే, రియల్ మాడ్రిడ్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నది. ఒకవేళ అట్లెంటిక్ మాడ్రిడ్ జట్టును ఆదివారం రియల్ మాడ్రిడ్ ఓడిస్తే తదుపరి నాలుగు మ్యాచ్‌ల్లో బార్సిలోనా తప్పక గెలువాల్సి ఉంటుంది. వచ్చేనెల ఆరో తేదీన నౌ క్యాంప్‌లో ఫైనల్స్ టోర్నీ జరుగనున్నది.

అట్లెంటికో మాడ్రిడ్ జట్టుపై తమ జట్టు విజయం గురించి తనకు ఆందోళన లేదని జినెడిన్ జిడానె తెలిపారు. కానీ చారిత్రాత్మక ప్రత్యర్థి బార్సిలోనా లీగ్ టైటిల్ గెలుచుకునేందుకు దగ్గరవుతుండటమే ఆయనకు ఆందోళన కలిగిస్తున్నది. కానీ ఆదివారం జరిగే మ్యాచ్‌లో గెలుపుపైనే ద్రుష్టిని కేంద్రీకరించామని జినెడిన్ జిడానె తెలిపాడు. తమ రెండు జట్ల మధ్య తేడా తగ్గించడానికే ప్రాధాన్యం ఇస్తామని చెప్పాడు.

'లీగ్ టోర్నీలో అట్లెంటికో మాడ్రిడ్ రెండో స్థానంలో నిలువాలని రాసిపెట్టుంది. కానీ మా రెండు జట్ల మధ్య తేడా తగ్గించడానికి ప్రాధాన్యం ఇస్తాం' అని జిడానె అన్నాడు. అయితే ఆదివారం జరిగే మ్యాచ్‌లో గెలుపుపై ఇరు జట్లు గట్టి విశ్వాసం పెంచుకున్నాయి. చాంపియన్స్ లీగ్‌లో జువెంటస్ జట్టుపై సంచలన గోల్స్ చేసి రియల్ మాడ్రిడ్.. యూరోపా లీగ్ సెమీస్ దశలో స్పోర్టింగ్ లిస్బాన్ జట్టుపై 2 - 0 స్కోర్ తేడాతో గెలుపొంది విశ్వాసంతో ఉన్నాయి.

Story first published: Sunday, April 8, 2018, 14:12 [IST]
Other articles published on Apr 8, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి