న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

పోటెత్తిన జనం.. హోరెత్తిన శుభాకాంక్షలు

World Cup: France welcomed by hundreds of thousands of supporters

హైదరాబాద్: జగజ్జేత ఫ్రాన్స్ ఫిఫా వరల్డ్ కప్ 2018 ట్రోఫీతో స్వదేశంలో అడుగుపెట్టింది. ఈ మేరకు ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ప్రపంచకప్‌ను, ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వేలాది మంది అభిమానులు దారిపొడవునా నిలబడి హర్షధ్వానాలతో.. పూలను జిమ్ముతూ స్వాగతం పలికారు. ఆదివారం రాత్రి నుంచి ఫ్రాన్స్‌లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

వెల్లువలా రోడ్ల మీదకు దూసుకొచ్చిన జనాలు

జాతీయ జెండాలతో రోడ్ల మీదకు వెల్లువలా దూసుకొచ్చిన జనాలు తాగుతూ.. చిందులేస్తూ.. ఈలలేస్తూ.. సందడి చేశారు. దాదాపు పారిస్‌లో దాదాపు 70 వేలమంది అభిమానులు రోడ్ల మీదకు వచ్చి తమ జట్టును కీర్తిస్తూ ముందుకు సాగారు. ప్రపంచకప్‌ విజేతలుగా నిలిచిన ఫ్రాన్స్‌ ఆటగాళ్లను లిజియన్‌ ఆఫ్‌ హానర్‌ అవార్డుతో సత్కరించాలని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్‌ మాక్రోన్ నిర్ణయించారు.

అత్యున్నత సేవలు అందించిన వారికి

దేశానికి అత్యున్నత సేవలు అందించిన వారికి ఫ్రాన్స్‌లో ఈ అవార్డు అందజేస్తారు. 20 ఏళ్ల క్రితం ఫ్రెంచ్‌ జట్టు ప్రపంచకప్‌ గెలిచినప్పుడు కూడా అప్పటి జట్టును ఆ నాటి అధ్యక్షుడు జాక్వెస్‌ చిరెక్‌ ఈ అవార్డుతోనే సత్కరించారు.

ఆటగాళ్లకు దక్కిన అరుదైన గౌరవం:

పారిస్‌లోని ఆరు మెట్రో స్టేషన్లకు తాత్కాలికంగా ఫుట్‌బాల్‌ స్టార్ల పేర్లను పెట్టాలని ఫ్రాన్స్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విక్టర్‌ హుగో స్టేషన్‌ ఇకపై విక్టర్‌ హుగో లోరిస్‌గా మారగా.. నోట్రె డామ్‌ స్టేషన్‌ నొట్రె డిడియర్‌ డెషాంప్స్‌గా మారింది. ఎలిసెస్‌ క్లెమోన్‌సి స్టేషన్‌ను కూడా డెషాంప్స్‌ ఎలిసెస్‌ క్లెమోన్‌సిగా మార్చారు బెర్సి స్టాప్‌ బెర్సి లెస్‌ బ్లూస్‌ అయింది.

కోచ్‌ గారెత్‌ సౌత్‌గేట్‌ పేరును లండన్‌లోని

కోచ్‌ గారెత్‌ సౌత్‌గేట్‌ పేరును లండన్‌లోని

ఇంగ్లాండ్‌ కూడా తమ జట్టు అద్భుత ప్రదర్శనలో కీలక పాత్ర పోషించిన కోచ్‌ గారెత్‌ సౌత్‌గేట్‌ పేరును లండన్‌లోని ఓ భూగర్భ రైల్వేస్టేషన్‌కు పెట్టాలని నిర్ణయించింది.

Story first published: Tuesday, July 17, 2018, 9:45 [IST]
Other articles published on Jul 17, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X