న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా వరల్డ్ కప్: మ్యాచ్ ఆడనని చెప్పడంతో ఇంటికి పంపించిన కోచ్

By Nageshwara Rao
World Cup 2018: Nikola Kalinic excluded from Croatia squad after arguing he was unable to play against Nigeria

హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్‌లో తమ దేశం తరుపున ప్రాతినిథ్యం వహించాలని ప్రతి ఒక్క సాకర్ ఆటగాడు కోరుకుంటాడు. అయితే, ఓ ఆటగాడు మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని చేజేతులా కాదనుకున్నాడు. ఇంతకీ ఎవరా ఆటగాడని అనుకుంటున్నారా? క్రొయేషియా ఫ్వార్వర్డ్‌ ప్లేయర్ నికొలా కలినిచ్‌.

రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ నుంచి నికొలా కలినిచ్‌ స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. దీనికి పెద్ద కారణమే ఉంది. టోర్నీలో భాగంగా గత వారంలో నైజీరియాతో మ్యాచ్ ఆడాల్సిందిగా జట్టు కోచ్ కోరితే అందుకు నిరాకరించాడు. నైజీరియాతో మ్యాచ్‌లో రెండో అర్ధభాగంలో సబ్‌స్టిట్యూట్‌గా వెళ్లాల్సిందిగా కోచ్‌ జ్లాకో డాలిచ్‌ నికొలాను కోరాడు.

ఇందుకు గాను నికొలా కలినిచ్‌ తాను ఆడలేనని తేల్చి చెప్పాడు. దీంతో కోచ్ కోపంతో నికొలాను స్వదేశానికి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించాడు. అయితే నికొలా మాత్రం తనకు వెన్ను గాయం అయిందని.. అందుకే కోచ్‌ ఆదేశాలు పాటించలేదని వెల్లడించడం విశేషం.

అయితే కలినిచ్‌ నికొలా స్వదేశానికి వెళ్లే విషయాన్ని క్రొయేషియా ఫుట్‌బాల్‌ అసోసియేషన్ మాత్రం అధికారికంగా ధ్రువీకరించలేదు. కాగా, ఫిఫా వరల్డ్ కప్‌లో క్రొయేషియా శుభారంభం చేసింది. దీంతో రెండు దశాబ్దాల తర్వాత ఫుట్‌బాల్‌ వరల్డ్ కప్‌లో తాము ఆడిన తొలి లీగ్‌ మ్యాచ్‌లోనే క్రొయేషియా విజయం సాధించింది.

గ్రూప్‌-డి మ్యాచ్‌లో క్రొయేషియా 2-0తో నైజీరియాను ఓడించింది. నైజీరియా ఆటగాడు ఒగెనెకరో ఎటెబో చేసిన సెల్ఫ్‌ గోల్‌తో క్రొయేషియా ఆధిక్యం సాధించగా, ఆ తర్వాత 71వ నిమిషంలో కెప్టెన్‌ మోడ్రిక్‌ గోల్‌తో క్రొయేషియా 2-0తో ఆధిక్యాన్ని సాధించింది. ఆట 32వ నిమిషంలో అంటె రెబిక్, మరియో మండ్‌జుకిక్‌నుంచి బంతిని అందుకునే క్రమంలో కార్నర్ వద్ద అనూహ్యంగా ఎటెబో తమ గోల్‌పోస్ట్‌లోకే గోల్‌ కొట్టాడు.

దీంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి క్రొయేషియా 1-0తో నిలిచింది. ఇక, రెండో అర్ధభాగంలో క్రొయేషియా దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో క్రొయేషియా ఫార్వర్డ్ ప్లేయర్లు డెజన్‌ లొవ్రెన్, ఒడియన్‌ ఇగాలో బంతిని నైజీరియా గోల్ పోస్టువైపే ఆడారు. ఈ క్రమంలో పలుమారుల్ గోల్స్ కొట్టేందుకు ప్రయత్నించినా ప్రత్యర్థి జట్లు డిఫెండర్లు వారిని నిలువరించారు.

ఫలితంగా 59వ నిమిషంలోగానీ నైజీరియా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ వద్ద గోల్‌గా మలచలేకపోయింది. ఆ తర్వాత నైజీరియా డిఫెండర్‌ విలియమ్‌ ట్రూస్ట్‌ ఎకాంగ్‌ కార్నర్‌ వద్ద క్రొయేషియా ఫార్వర్డ్‌ ఆటగాడు మరియో మండ్‌జుకిక్‌ను కిందపడేయడంతో రిఫరీ పెనాల్టీ కిక్‌ ఇచ్చాడు. ఆట 71వ నిమిషంలో మోడ్రిక్‌ దానిని గోల్‌గా మలచడంతో క్రొయేషియా 2-0తో విజయం సాధించింది.

Story first published: Tuesday, June 19, 2018, 10:39 [IST]
Other articles published on Jun 19, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X