న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఆ ఒక్క స్థానం ఎవరికి దక్కనుందో..?

Who will replace Antonio Conte at Chelsea end of the season?

హైదరాబాద్: ప్రీమియర్ లీగ్‌లో భాగంగా జరగుతున్న పోటీలలో ఆంటోనీ కాంటె చిల్సీ మేనేజర్‌గా కొనసాగనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే రోజురోజుకూ పోటీ తీవ్రత ముదిరిపోతుండటంతో కొత్త మేనేజర్ కావాలసిందంటూ అధిష్టానం త్వరపడ్డా చివరికి ఆంటోని కాంటెనే అని నిర్ధారించాయి. గతేడాది ఇదే ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన బ్లూస్ ఈ ఏడాది అదే ఫలితాన్నిస్తుందనే ఆశతో అతనికే తిరిగి బాధ్యతలు అప్పజెప్పే యోచనలో ఉంది.

ఇంగ్లాండ్ లో జరుగుతున్న ఈ లీగ్ ను గెలవడం అంత సులభతరం కాదు. అలాంటి పనిని అతను సుసాధ్యం చేసి చూపించాడు. కాంటె జట్టు ఐదు పాయింట్లతో లీగ్ పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. దానికంటే ముందు స్థానంలో టొట్టెన్‌హమ్ కొనసాగుతోంది. ఏదైతే స్థానంలో బ్లూస్ జట్టు ఉందో.. అంతటి కంటే మెరుగ్గానే చూడాలని మళ్లీ జట్టులోని అందరి ఆలోచన.

ఇప్పటికే దీని కోసం జట్టుకు మేనేజర్‌గా ఉంచాలని ముగ్గురు వ్యక్తులను పరిశీలిస్తున్నారు.

1. మోరిజో సర్రి

నేపోలీ మేనేజర్ మోరిజో సర్రి మేనేజర్ జాబితాలో అందరికంటే ముందున్నాడు. ఇప్పటికే ఇతన్ని జట్టుతో ఒప్పందం కుదుర్చుకుందంటూ రూమర్లు కూడా వ్యాప్తి చెందడంతో దాదాపు ఇతనే ఖరారనుకొని చాలామంది భావించారు. ప్రస్తుతం నేపోలీ జట్టుకు మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. జ్యూవెంటస్‌తో పోరాడి సిరీ ఏ టైటిల్‌ను కోల్పోయిన జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించింది ఇతనే.

2. లూయీస్ ఎన్రిక్
బార్సిలోనా జట్టు మాజీ మేనేజర్ లూయీస్ ఎన్రిక్‌ను కూడా మరో చాయీస్‌గా తీసుకోనట్లుగా సమాచారం. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఇతనికి చాలానే అనుభవముంది. మేనేజర్ గా అతని కెరీర్‌ను బార్సిలోనా బి జట్టు నుంచే ప్రారంభించాడు. 2014-15, 2015-16 వరకు బార్సిలోనా సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి లా లీగా టైటిళ్లు గెలుచుకున్నాడు. 2014-15 సంవత్సరానికి గాను బార్సిలోనా జట్టుకు ఛాంపియన్ లీగ్‌ను కూడా తెచ్చిపెట్టాడు. ఈ నేపథ్యంలో లూయీస్ ఎన్రిక్ చిల్సీ జట్టు మేనేజర్ పదవిలో కొనసాగేందుకు అవకాశాలెక్కువగా కనిపిస్తున్నాయి.

3. మస్సిమిలానో అల్లెగ్రి

ఛాంపియన్ లీగ్‌లో మెరుగైన ప్రదర్శన చూపిస్తున్న జ్యూవెంటస్ జట్టు మేనేజర్ మస్సిమిలానొ అల్లెగ్రీ ప్రస్తుతమున్న జట్టుతో కొనసాగేందుకు అయిష్టతతో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతని నాయకత్వంలో జట్టును నడిపిస్తే ఎలా ఉంటుందనే చర్చలు జరుగుతున్నాయి. జ్యూవెంటస్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించి 2014-15, 2015-16 సంవత్సరాల్లో యూఈఎఫ్ఏ ఛాంపియన్ లీగ్ టైటిళ్లను సాధించిపెట్టాడు.

Story first published: Friday, April 20, 2018, 19:58 [IST]
Other articles published on Apr 20, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X