న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

సాకర్ ఫీవర్: రష్యాలో వరల్డ్‌కప్ గెలిచే ఆ ఆరు జట్లు ఇవేనా?

By Nageshwara Rao
Top six contenders to win the 2018 FIFA World Cup

హైదరాబాద్: సాకర్ సంరంభానికి సర్వం సిద్ధమైంది. జూన్ 14 నుంచి జులై 15 వరకు రష్యా వేదికగా జరిగే ఫిఫా వరల్డ్ కప్‌లో చివరకు టైటిల్ విజేతగా నిలిచేది మాత్రం ఒక్క జట్టే. పుట్‌బాల్ రంగంలో యూఈఎఫ్ఏ చాంపియన్స్‌ లీగ్‌, యూఈఎఫ్ఏ యూరోపియనన్ ఛాంపియన్‌షిప్, ఒలింపిక్స్, కోపా అమెరికా ఇలా అనేక టోర్నీలు ఉన్నప్పటికీ ఫిఫా వరల్డ్‌కప్‌కు ఉన్న ప్రత్యేకత వేరు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

ఈసారి టోర్నీలో మొత్తం 32 జట్లు పాల్గొంటున్నాయి. నాలుగు జట్లతో మొత్తం ఎనిమిది గ్రూపులు. తొలుత గ్రూప్‌ మ్యాచ్‌లు ఆతర్వాత రౌండ్‌-16, క్వార్టర్స్‌, సెమీస్‌, ఫైనల్‌తో కలుపుకొని మొత్తం 64 మ్యాచ్‌లు జరగనున్నాయి. జులై 15వ తేదీన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరో ఆరు రోజుల్లో రష్యాలో ఆరంభమయ్యే వరల్డ్ కప్‌లో టైటిల్ విజేతగా నిలిచే సత్తా కలిగిన దేశాల్లో ఏ జట్లు ముఖ్యమైనవే ఒక్కసారిగా పరిశీలిద్దాం...

అర్జెంటీనా

అర్జెంటీనా

దేశ ప్రజల కోరిక మేరకు తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మళ్లీ జట్టులోకి వచ్చిన దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ తన అద్భుతమైన ఆటతో అర్జెంటీనాను క్వాలిఫయర్స్‌ కష్టాల నుంచి గట్టెక్కించాడు. డిబాలా, అగ్వెరో, హిగ్వెయిన్‌, డి మారియాలకు మెస్సీ తోడవడంతో ఆ జట్టు ఫార్వర్డ్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. తమదైన రోజున అర్జెంటీనా జట్టును నిలువరించడం ఎవరికైనా కష్టం. ప్రత్యర్థిపై ఒత్తిడి తేవడంలో ముందంజలో ఉండే జర్మనీతో మ్యాచ్‌లో అర్జెంటీనా ఎలా ఆడుతుందన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

 బ్రెజిల్‌

బ్రెజిల్‌

స్వదేశంలో 2014లో జరిగిన ప్రపంచకప్‌ సెమీఫైనల్లో జర్మ నీ చేతిలో 1-7తో ఎదురైన ఘోర పరాభవం బ్రెజిల్‌ జట్టునేకాదు ఆ దేశ ప్రజల ను చాలాకాలం పీడకలలా వెంటాడుతూ నే వచ్చింది. ఆ విషాదం నుంచి బయటపడిన బ్రెజిల్‌.. ప్రధాన ప్రత్యర్థులు అర్జెంటీనా, చిలీలపై 3-0తో చిరస్మరణీయ విజయాలు సాధించి రష్యా వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఖ్యాతి గడించింది. 26 ఏళ్ల నెయమార్‌ ప్రస్తుతం కెరీర్‌లోనే అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ఈ వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచేందుకు బ్రెజిల్‌కు ఇంతకంటే మంచి తరుణం ఉండదు.

బెల్జియం

బెల్జియం

జట్టులో ప్రతిభకు కొదువ లేదు. అంతర్జాతీయ స్థాయిలో విజయాలు లేకపోవడమే బెల్జియం జట్టులో లోటు. ప్రపంచ మేటి మిడ్‌ఫీల్డర్‌ కెవిన్‌ డి బ్రూయిన్‌, ఫార్వర్డ్‌ హజార్డ్‌, ప్రత్యర్థి డిఫెన్స్‌ను కకావికలంచేసే డ్రైస్‌ మెర్టెన్స్‌, రొమేలు లుకాకు, మిచీ బట్షూయీలతో బెల్జియం జట్టు పటిష్ఠంగా ఉంది. కీపర్‌ తిబౌట్‌ కౌర్టోయి్‌సను బోల్తా కొట్టించడం ఇతర జట్లకు అంత సులువు కాదు.

జర్మనీ

జర్మనీ

2014లో బ్రెజిల్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో ‘ఫేవరెట్‌' అనే ముద్ర లేకుండా బరిలోకి దిగిన జర్మనీ ఏకంగా టైటిల్‌ విజేతగా నిలిచింది. 2017 కాన్ఫెడరేషన్‌ కప్‌లో ద్వితీయ శ్రేణి జట్టుతో తలపడిన జర్మనీ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇక, వరల్డ్ కప్ కోసం జరిగిన క్వాలిఫయిర్ టోర్నీలో పదింటికి పది గెలిచిన ఆ జట్టు 43 గోల్స్‌ చేసి యూరోపియన్‌ రికార్డుని నమోదు చేసింది.

ఫ్రాన్స్‌

ఫ్రాన్స్‌

సత్తా కలిగిన ఆటగాళ్లు ఈ జట్టు సొంతం. స్టార్ ప్లేయర్లు అలెగ్జాండర్‌ లకాజెట్టే, ఆంథోనీ మార్షల్‌లను కోచ్‌ డిడేర్‌ డిషాంప్స్‌ పక్కనపెట్టినప్పటికీ, ప్రతి విభాగంలోనూ సరైన ప్రత్యామ్నాయాలు ఉండటంతో వరల్డ్ కప్‌కు పటిష్టమైన జట్టుని ఎంపిక చేసుకున్నాడు. సొంత ప్రేక్షకుల మధ్య 2016 యూరో ఫైనల్లో పోర్చుగల్‌ చేతిలో ఓటమి ఫ్రాన్స్‌ అభిమానులను బాగా నిరాశకు గురి చేసింది. అయితే రష్యాలో విజేతగా నిలవడం ద్వారా తన అభిమానులకు మరచిపోలేని కానుక ఇవ్వాలని ఫ్రాన్స్‌ పట్టుదలగా ఉంది.

స్పెయిన్‌

స్పెయిన్‌

గత ఫిఫా వరల్డ్ కప్‌లో చెత్త ప్రదర్శనతో గ్రూప్‌ దశనుంచే నిష్క్రమించిన స్పెయిన్‌ను కోచ్‌ జులెన్‌ అనతికాలంలోనే శక్తివంతమైన జట్టుగా తీర్చిదిద్దాడు. ఫలితంగా 2016లో ఆ జట్టు వరుసగా రెండోసారి యూరోపియన్‌ టైటిల్‌ సొంతం చేసుకుంది. బలీయమైన మిడ్‌ఫీల్డ్‌కు స్పెయిన్‌ పెట్టింది పేరు. కానీ ఈ సారి సెర్గియో, గెరార్డ్‌లాంటి వారితో డిఫెన్స్‌ కూడా పటిష్టంగా మారింది.

Story first published: Saturday, June 9, 2018, 13:21 [IST]
Other articles published on Jun 9, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X