సూపర్ కప్ ఇండియా 2018కు వేదిక కానున్న భువనేశ్వర్

Posted By:
Super Cup India 2018: Tournament to be held in Bhubaneswar, Odisha

హైదరాబాద్: అఖిల భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ఇప్పటి వరకు కేరళలోని కొచ్చిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఫుట్‌బాల్‌కు సంబంధించిన చాలా వరకు లీగ్‌లు నిర్వహిస్తూ వస్తోంది. దీనికి ఒడిస్సా రాజధాని భువనేశ్వర్‌ను వేదిక చేయాలని ఆ రాష్ట్రం ఏఐఎఫ్ఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఆ కప్ ఇంతకుముందు జరిగిన ఫెడరేషన్ కప్ స్థానాన్ని భర్తీ చేయనుంది. దీంతో ఆ కప్ పట్ల అన్ని జట్లు యాజమాన్యాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ కప్‌లో భాగంగా ప్రతి జట్టుకు కేవలం రెండే రౌండ్లు ఉంటాయి. ఒకటి క్వాలిఫైయింగ్ రౌండ్ రెండోది ఫైనల్ రౌండ్. అన్ని మ్యాచ్‌లు భువనేశ్వర్ లోనే జరగనున్నాయి.

ఈ కప్‌కు అన్ని జట్లకు ఆతిథ్యమివ్వబోతోన్న భువనేశ్వర్‌ కళింగ స్టేడియం ఇండియన్ సూపర్ లీగ్‌లోని పలు మ్యాచ్‌లకు వేదికైంది. ఫిబ్రవరి 25న జగిన జంషెడ్‌పూర్ ఎఫ్‌సీ, బెంగుళూరు ఎఫ్‌సీల మధ్య మ్యాచ్ భువనేశ్వర్ వేదికగానే జరిగింది. ఈ మ్యాచ్‌లో బెంగుళూరు జట్టు 2-0తేడాతో గెలుపొందింది.

వేసవి కాలం కొంచెం కష్టమే:
ఐఎస్ఎల్, ఐలీగ్‌ల నుంచి నేరుగా ఎంపికైన ఆరు జట్లు సూపర్ కప్‌లో పాల్గొననున్నాయి. ఆతిథ్య కళింగ స్టేడియం దేశంలోని క్రీడలన్నింటికి రాజధానిలా మారింది. ఇంకా గతేడాది జరిగిన హాకీ వరల్డ్ కప్ లీగ్‌లో భాగంగా ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు సైతం వేదికగా నిలిచింది.

Story first published: Wednesday, March 7, 2018, 17:37 [IST]
Other articles published on Mar 7, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి