న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఢిల్లీ కాలుష్యం క్రీడలను కాటేస్తుంది.. రాజధానిని మక్కా చేద్దాం. . ఫుట్‌బాల్ ప్లేయర్ సెన్సేషనల్‌గా

Sunil Chhetri about Football clubs, Pollution in Delhi

దేశ రాజధాని ఢిల్లీని ఫుట్‌బాల్ క్రీడకు మక్కాగా మార్చే ఆలోచన ఉందనే అభిప్రాయాన్ని స్టార్ స్ట్రైకర్ సునీల్ ఛెత్రి వ్యక్తం చేశాడు. దేశ రాజధానిలో ఫుట్‌బాల్‌కు ఆదరణ లేకపోవడంపై ఆయన అసంతృప్తిని వెళ్లగక్కాడు. అంతేకాకుండా ఢిల్లీలోని వాతావరణ పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. వాతావరణ కాలుష్యం వల్ల క్రీడాకారులకు చేటు జరిగే అవకాశముందనే విషయాన్ని వ్యక్తం చేశాడు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ..

ఏ దేశ రాజధాని అయినా..

ఏ దేశ రాజధాని అయినా..

ఫుట్‌బాల్ అడే టాప్ కంట్రీని మీరు చూస్తే ఆ దేశ రాజధాని ఆ క్రీడకు హబ్‌గా ఉంటుంది. అలానే ఉంటేనే క్రీడాభిమానులు ఆదరణ పెరగడం జరుగుతుంది. అనేక మంది క్రీడలపై ఉత్సాహాన్ని చూపుతారు. అయితే అందుకు విభిన్నంగా ఢిల్లీ కనిపిస్తుంది. దేశ రాజధానిలో ఫుట్‌బాల్ క్రీడకు చోటున్నట్టు ఎక్కడా కనిపించదు. అలాంటి పరిస్థితిని మార్చి ఢిల్లీని ఫుట్‌బాల్‌కు ప్రధాన కేంద్రంగా మార్చాలి అని ఛెత్రి పేర్కొన్నారు. ఇండియన్ సూపర్ లీగ్‌లో ఢిల్లీ నుంచి జట్టు లేకపోవడం శోచనీయం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఫుట్‌బాల్ క్రీడను బలోపేతం చేద్దాం

ఫుట్‌బాల్ క్రీడను బలోపేతం చేద్దాం

ఇప్పటి వరకు ఢిల్లీలో ఫుట్‌బాల్ క్లబ్ లేకపోవడాన్ని పక్కన పెడితే.. ఇక ముందు దేశ రాజధానిలో ఫుట్‌బాల్ క్రీడను బలోపేతం చేసేందుకు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ నుంచి ఐ లీగ్ క్లబ్, 2 డివిజన్ క్లబ్ ఏర్పాటు చేసి ఐఎస్ఎల్ క్లబ్‌‌లో చేరేలా తగు చర్యలు తీసుకొంటాం. సరైన క్లబ్స్ లేకపోవడం వల్ల ఔత్సాహిక ఫుట్‌బాల్ క్రీడాకారులు ఆటకు దూరమవుతున్నారనే ఆందోళనను ఛెత్రీ వ్యక్తం చేశాడు.

ఢిల్లీలో ఒక్క క్లబ్ ఉండదా?

ఢిల్లీలో ఒక్క క్లబ్ ఉండదా?

యువకుడిగా ఫుట్‌బాల్‌పై మక్కువ పెంచుకొన్న రోజుల్లో ఢిల్లీలో ఆడటానికి ఒక్క క్లబ్ కూడా లేదు. అందుకే నేను ఢిల్లీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. అది అందరికీ సాధ్యపడే విషయం కాదు. కానీ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా రాణించడానికి ఢిల్లీ నుంచి బయటకు వెళ్లి నేను ఎన్నో కష్టాలు పడ్డాను. ఇక ముందు ఐఎస్ఎల్, ఐ లీగ్ పోటీల కోసం ఢిల్లీ నుంచి జట్లు పాల్గొంటాయని ఆశిద్దాం అని ఛెత్రీ పేర్కొన్నారు.

కాలుష్యం కాటేస్తున్నది..

కాలుష్యం కాటేస్తున్నది..

ఇక ఢిల్లీ కాలుష్య పరిస్థితులపై సునీల్ ఛెత్రీ ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కాలుష్యం కారణంగా కళ్ల మంటలతో ఆటగాళ్లు బాధపడుతున్నారు. విదేశీ ఆటగాళ్లు ఢిల్లీకి వస్తే మాస్కులు ధరిస్తూ తిరగాల్సి వస్తున్నది. నేను ఢిల్లీకి చెందిన వాడినప్పటికీ.. నాకు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాను అని సునీల్ ఛెత్రి అన్నారు.

Story first published: Thursday, October 31, 2019, 13:49 [IST]
Other articles published on Oct 31, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X