బాధను దిగమింగి మాంచెస్టర్ సిటీకి శుభాకాంక్షలు తెలిపిన మొరినొ

Posted By:
Mourinho congratulates City despite spoiling their party

హైదరాబాద్: మాంచెస్టర్ యునైటెడ్ జట్టు మొరినొ క్రీడా స్ఫూర్తి చూపించాడు. తమ జట్టును ఓడించినా.. ప్రీమియర్ లీగ్‌ను గెలుచుకున్నందుకు తన శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇంకా ఆరు గేమ్‌లు మిగిలి ఉండగానే దాదాపు లీగ్ విజయాన్ని ఖరారు చేసింది మాంచెస్టర్ సిటీ.

ఆట సరిగ్గా 69వ నిమిషంలో క్రిస్ స్మైలింగ్ మాంచెస్టర్ సిటీ మ్యాచ్‌నంతా చేతుల్లోకి తీసుకున్నంత పని చేశాడు. దీంతో మ్యాచ్‌ను సిటీ జట్టు 0-3 తేడాతో లివర్‌పూల్ వేదికగా కోల్పోయింది. ఒకవేళ టొట్టెనహమ్ జట్టుతో పోటీపడి గెలిస్తే ఈ వారాంతంలో జరగనున్న సిటీ జట్టు టైటిల్ పోరులో నిలవనుంది.

అదే ఉద్దేశ్యంలో మొరినో ఈ మ్యాచ్ కోల్పోయినా పెద్దగా నిరాశ చెందలేదు. లీగ్ గెలిచేందుకు శనివారం జరగనున్న మ్యాచ్ మరో అవకాశంగా నిలవనుందన్న నేపథ్యంలో మొరినో జట్టుపై ఆశను కోల్పోలేదు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు.

'మేము రెండో స్థానంలో లీగ్‌ను ముగించడమే మా ఛాలెంజ్. ఎందుకంటే వాళ్లు ఇప్పటికే లీగ్ గెలుస్తారనేది కన్‌ఫమ్ అయిపోయింది. మరెవ్వరికీ అవకాశం లేనంతగా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆడారు. ఈ సందర్భంగా వాళ్లకు శుభాకాంక్షలు చెప్పడమే మేలు. వారిని తిట్టిపోసుకుని వాళ్లు ఆనందాన్ని పాడు చేయడం సబబు కాదు.' అని తెలిపారు.

Story first published: Monday, April 9, 2018, 17:35 [IST]
Other articles published on Apr 9, 2018
Read in English: Mourinho congratulates City
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి